‘గోపాల గోపాల' మూవీ షూటింగ్‌లో పవన్ కల్యాణ్ కు వెంకటేష్ ఒక ఊహించని బహుమానం ఇచ్చి పవన్ ను జోష్ లో పెట్టేసాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పవన్ ఆరోగ్యానికి సంబంధించి రకరకాల నెగిటివ్ వార్తల హడావిడితో ఈ సినిమా షూటింగ్ చాల నెమ్మదిగా జరుగుతోంది అనే వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలన్నీ అవాస్తవాలనీ పవన్ ఈ సినిమా సెట్ పై వెంకీతో తనకున్న స్నేహంతో జోక్స్ వేస్తూ సరదాగా ఉంటున్నాడని యూనిట్ సభ్యులు క్లారిటీ ఇస్తున్నారు అనే వార్తలు వినపడుతున్నాయి.  అదేవిధంగా పవన్ వెంకటేష్ లకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ సమయంలో వచ్చే షూటింగ్ గ్యాప్ లో పవన్ వెంకీలు అనేక ఆధ్యాత్మిక అంశాల పై ఇద్దరూ తెగ మాట్లాడుకుంటూ సినిమా సెలెబ్రెటీలుగా వెలుగొందుతున్న వీరిద్దరికీ ఇంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉందా అని అనిపించేడట్లుగా వీరి సంభాషణలు వినడానికి అత్యంత ఆశక్తి దాయకంగా సాగుతున్నట్లు ఫిలిం యూనిట్ టాక్. ఇది ఇలా ఉండగా ఈ మధ్యన వెంకటేష్ పవన్ కు మంచి ఆధ్యాత్మిక అంశాలతో కూడిన కొన్ని సాహిత్య గ్రంధాలు, డీవీడీలని బహుమతిగా ఇస్తే అనుకోని ఈ బహుమతికి పవన్ తెగ ఆనంద పడ్డాడని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో నటిస్తున్న శ్రియ కూడా పవన్ వెంకటేష్ లతో కలిసి నటించే సన్నివేశాల చిత్రీకరణ సమయంలో శ్రియ పవన్, వెంకీల పై జోక్స్ వేస్తూ షూటింగ్ స్పాట్ ను నవ్వుల మయంగా చేస్తోంది అని యూనిట్ వర్గాలు అంటున్నాయి.  పవన్ ఆరోగ్యం పై ఇప్పటి వరకు రకరకాల నెగిటివ్ వార్తలతో కలత చెందిన పవన్ అభిమానులకు ఈ లేటెస్ట్ న్యూస్ మంచి జోష్ ను ఇస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: