తన 63వ వయస్సులో కూడ రజనీకాంత్ తన సాహసాలతో ఒక హూలీవుడ్ స్టంట్ మాస్టర్ కు షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న ‘లింగా’ సినిమా షూటింగ్ లో ఈ సంఘటన జరిగింది. తన 63వ వయస్సులో కూడ రజినీ చేసిన రిస్కీ యాక్షన్ సన్నివేసాలు కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.  రజనీకాంత్ సినిమాలంటే ఫైట్స్ కాస్త డిఫరెంట్‌గా వుంటాయి అన్న విషయం అందరికి తెలిసిందే. ఆ ఫైట్స్ లేనిదే రజినీ అభిమానులు ధియేటర్లలో కూర్చోరు. దీనికోసం ‘లింగా’లో కనివినీ ఎరుగని రీతిలో యాక్షన్ దృశ్యాలు వుండబోతున్నాయట. దీనికి సంబంధించి రిహార్సల్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి.  ఈ విషయాన్ని హాలీవుడ్ ఫైట్ మాస్టర్ లీ విట్టేకార్ తన ట్విటర్‌లో రాసుకొచ్చాడు. ఈ తరహా డేర్ డెవిల్ యాక్షన్ సీన్స్‌ని తానెప్పుడూ డిజైన్ చేయలేదని ఇందుకోసం 4 కె హైస్పీడ్ కెమెరాలు వినియోగిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఇటువంటి రిస్కీ ఫైట్స్ చేయడానికి ముందుకు వచ్చిన రజినీ ధైర్యాన్ని వివరించడానికి తన వద్ద మాటలు లేవు అని అంటున్నాడు విట్టేకార్. గతంలో కమల్‌హాసన్ ‘విశ్వరూపం’, అజిత్ ‘ఆరంభం’ వంటి సినిమాలకు మాత్రమే పనిచేసిన విట్టేకార్ రజినీ ‘లింగా’ కోసం డిజైన్ చేస్తున్న ఫైట్స్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. దీపావళికి ఈ సినిమా ఆడియోను, రజనీకాంత్ బర్త్‌డే డిసెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ ను నిర్మాత లు ప్లాన్ చేస్తున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. రజినీ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చేస్తున్న ఈ సాహసం ‘లింగా’ కు హాట్ టాపిక్ గా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: