సూపర్ హిట్ అయిన సినిమాలకు సాధారణంగా సీక్వెల్స్ వస్తూ ఉంటాయి. రామ్ గోపాల్ వర్మను సంచలన దర్శకుడిగా, నాగార్జునను మాస్ హీరోగా నిలబెట్టిన ‘శివ’ సినిమాపై ఒక డాక్యుమెంటరి తీసి దానిని వచ్చే నెల అక్టోబర్ 5వ తారీఖున విడుదల చేస్తాను అని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ నిర్ణయం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. చాల సంవత్సరాల క్రితం విడుదలై తెలుగు సినిమాల నిర్మాణంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన శివ ఒక ట్రెండ్ సెటర్ అనే విషయం ఎవరూ కాదనలేని సత్యం. అయితే ఇప్పుడు శివ పేరుతో కొత్తగా ఫేస్ బుక్, శివ నిర్మాణం పై డాక్యుమెంటరి లాంటి విషయాలు ప్రస్తుతం పనిలేక రామ్ గోపాల్ వర్మ చేస్తున్నాడు అంటూ వర్మ పై సెటైర్లు పడుతున్నాయి. అంతేకాదు ఈనాటి టీనేజ్ తరానికి శివ సినిమా గురించి చెప్పడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాను అని చెపుతున్న వర్మ మాటలు విన్నవారు ‘శివ’, ‘మాయాబజార్’ లాంటి అద్భుతమా? ఈనాటి టీనేజ్ తరానికి తెలియడానికి అంటూ వర్మ పై టార్గెట్ చేస్తున్నారు విమర్శకులు. ఈమధ్య కోట్లాది రూపాయల ఆర్ధిక సమస్యలలో వర్మ ఉన్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో టెన్షన్ లో ఉన్న వర్మ చేయడానికి ఏ పని లేక ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాడనుకోవాలి. అయితే ఈ డాక్యుమెంటరిలో నాగార్జున అభిప్రాయాలు ఉంటాయో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: