టాలీవుడ్ లో తనకు కలిసి వస్తుందనుకున్న ‘ఆగడు’ ఫెయిల్ కావడం తమన్నా టాలీవుడ్ కెరియర్ ను అయోమయంలో పడేసింది. ఆమధ్యన నాగార్జునతో మిల్కీ బ్యూటీ జోడీ కడుతుంది అని వార్తలు వినిపించినా తమన్నకు నాగ్ తో అవకాశం వచ్చినట్లే వచ్చి చేయి జారిపోయింది. దీనితో విసిగి పోయిన తమన్నా డిజైనర్ గా మారిపోతాను అంటూ మీడియా ముందు తన గొప్పలు చెప్పుకుంటోంది. తమన్నాలో మంచి డిజైనర్ అవతారం కూడా ఉన్నదట. డిజైనర్ అనగానే కాస్ట్యూమ్ డిజైనరో, పబ్లిసిటీ డిజైనరో అనుకోకండి. తమన్నా గోల్డ్ డిజైనర్ అట. అంతేకాదు తాను నటించే సినిమాలలో తాను ధరించే ఆభరణాలకు తానే డిజైన్ చేసుకుంటానని ఈ మిల్కీ బ్యూటీ గొప్పలు చెపుతోంది.  నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనే తనకు తాను ధరించే ఆభరణాలు అన్నీ తను డిజైన్ చేసినవే అని అంటోంది. దీనికి కారణo తన తండ్రిది నగల వ్యాపారం అవడంతో తాను తరచూ తండ్రి నగల దుకాణానికి వెళుతూ ఉండటం వల్ల తనకు ఈ డిజైనింగ్ ఆర్ట్ వచ్చిందని చెపుతోంది తమన్నా. లేటెస్ట్ గా తమన్నా నటించవలసిన ఒక కోలీవుడ్ సినిమా మరో హీరోయిన్ తన్నుకు పోవడంతో ప్రస్తుతం తమన్నా ఖాళీయే కాబట్టి ముంబాయిలో కాని హైదరాబాద్ లోకాని తాను డిజైన్ చేసిన నగలతో తమన్నా జ్యూయలరీ షాప్ ఓపెన్ చేస్తుందేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: