ఈవారం విడుదల కాబోతున్న గోపీచంద్ ‘లౌక్యం’ సైలెంట్ హిట్ గా ఏమైనా సంచలనాలు సృష్టిస్తుందా? అనే అనుమానాలు కొందరికి కలుగుతున్నాయి. గోపీచంద్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ‘శంఖం’, ‘మొగుడు’, ‘సాహసం’ లాంటి పరాజయాల తరువాత వస్తున్న ‘లౌక్యం’ విడుదల విషయంలో నిర్మాతలు అనుసరిస్తున్న ‘లౌక్యం’ టాలీవుడ్ ప్రముఖులకే అర్ధం కాని పజిల్ గా మారింది.  భారీ అంచనాలతో దూసుకు వస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ విడుదలకు కేవలం ఐదు రోజుల ముందు ఏ ధైర్యంతో ‘లౌక్యం’ సినిమాను విడుదల చేస్తున్నారో విశ్లేషకులకు కూడా అర్ధంకాని పజిల్ గా మారిపోయింది. ఈ సినిమా దర్శకుడు శ్రీవాస్, రచయిత కోన వెంకట్ చెపుతున్న విషయాలను బట్టి ఈ సినిమాలో అంత విషయం ఉందా అని అనిపిస్తోంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రచారం జరుగుతున్న ‘లౌక్యం’ ఈవారం 800 ధియేటర్లలో విడుదల కావడం సంచలనంగా మారింది. అంతేకాదు సినిమా విడుదల కాకుండానే బ్రహ్మీ డైలాగులతో పబ్లిసిటీకి తెరతీసింది. బ్రహ్మీ ది ఈ సినిమాలో మoచి క్యారెక్టర్ అన్న ప్రచారం జరుగుతోంది.  గోపీచంద్ ను హైలెట్ చేయకుండా కేవలం బ్రహ్మానందo పాత్రను హైలెట్ చేస్తూ సాగుతున్న పబ్లిసిటీ బట్టి గోపీచంద్ ఈ సినిమా విషయంలో బ్రహ్మి పై గట్టి నమ్మకం పెట్టుకున్నాడు అని అనిపిస్తోంది. ‘ఆగడు’ ను రక్షించ లేకపోయిన బ్రహ్మి గోపీచంద్ ను ఎంత వరకు ఆదుకుంటాడో ఈవారం తేలిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: