మోడలింగ్ రంగంతో తన కెరియర్ ను ప్రారంభించి ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ అర్చనా పాండే ఆత్మహత్య చేసుకుంది అనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. ముంబాయిలో లోఖండ్ వాలా ప్రాంతంలో ఉంటున్న ఈమె తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది అని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది.  ముంబాయ్ పోలీసులు ఈమె ఆత్మహత్య వెనుక కారణాలను సోధిస్తున్నట్లు మీడియా న్యూస్. ఆమె నివాసం వుంటున్న ఇంట్లోంచి సోమవారం భరించలేనంత దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు వెళ్ళి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె ఇంటి తలుపులను బ్రేక్ చేసి చూడగా ఆమె మృతదేహం కనిపించడమే కాకుండా ఒక సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది అనే వార్తలు వస్తున్నాయి. డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కూపర్ ఆసుపత్రికి తరలించారు అని తెలుస్తోంది. ఆమె ఆత్మహత్యకి గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు చెబుతున్నారు. మోడలింగ్ పరిశ్రమలోనే కాకుండా కొన్ని దక్షిణాది సినిమాలలో కూడా నటించిన అర్చన పాండే గత కొంత కాలంగా డిప్రెషన్‌లో వున్నట్లు ఆమె సన్నిహితమిత్రుల మాటలు బట్టి తెలుస్తోంది. ఈ మధ్య రకరకాల కారణాలతో బలి అయిపోతున్న హీరోయిన్స్ ఆత్మహత్యల లిస్టులో అర్చనా పాండే లేటెస్ట్ గా చేరింది. ఈమె ఆత్మహత్య ప్రస్తుతం బాలీవుడ్ సినిమా రంగంలో అవకాశాలు లేక అనిశ్చితి లో కూరుకు పోతున్న హీరోయిన్స్ జీవితాలకు మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు.   

మరింత సమాచారం తెలుసుకోండి: