టాలీవుడ్ లో తన తొలి సినిమా రాకుండానే అఖిల్ బాలీవుడ్ కు చెందిన పెళ్ళి అయిన హీరోయిన్ తో రొమాన్స్ చేయడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. అఖిల్ టైటాన్ వాచ్ కంపెనీ యాడ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్యనే ఈ యాడ్ షూటింగ్ ను పూర్తి చేసారు.  త్వరలోనే ఈ యాడ్ బుల్లితెర పై హంగామా చేయబోతోంది. అయితే ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే ఈ యాడ్ లో అఖిల్ బాలీవుడ్ హాట్ హీరోయిన్ కల్కి కోచ్లిన్‌ తో నటించాడు. ఈ యాడ్ టీజర్ విడుదలైంది. ఈ యాడ్ లో అఖిల్ రొమాన్స్ అదిరిపోయింది అంటూ అభిమానులు అప్పుడే మెచ్చుకుంటున్నారు. అయితే మరొక ఆశక్తికరమైన విషయం ఏమిటంటే ఈ యాడ్ లో అఖిల్ తో నటించిన కల్కికొచ్లిన్ ఎవరోకాదు, బాలీవుడ్‌లో తనకంటూ పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ భార్య. ‘దేవ్ డి' ఫిలిం ద్వారా ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. అనురాగ్‌ కశ్యప్‌తో ఈమెకు ఏర్పడిన పరిచయం పెళ్లికి దారి తీసింది.  అయితే ఈమధ్య వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఈ ప్రేమ జంట విడిపోతోంది అంటూ బాలీవుడ్ మీడియా గాసిప్పులు రాస్తోంది. ఏది ఎలా ఉన్నా పెళ్లి చేసుకున్న హీరోయిన్ తో అఖిల్ రొమాన్స్ మీడియాకు హాట్ టాపిక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: