మెగా హీరో రామ్ చరణ్ నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ గోవిందుడు అందరివాడే మూవీ విడుదలకి ముందే సంచనాలకి తెరలేపతుంది. దీనర్ధం రామ్ చరణ్ కొత్త రికార్డ్ లకి తెరలేపాడని కాదు. రామ్ చరణ్ మొదటి సారిగా క్లీన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీలో నటించడంతో గోవిందుడు అందరివాడేలే మూవీపై విపరీతమైన హైప్స్ క్రియేట్ అవుతున్నాయి. దీంతో మూవీపై సాధారణ ప్రేక్షకుల్లోనూ, అలాగే బిజినెస్ వర్గాల్లోనూ మూవీ సక్సెస్ ఏ విధంగా ఉంటుందనే విధంగా టాక్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో చెప్పినట్టుగానే, ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రికార్డు లెవల్లో విడుదలచేయటానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఇప్పటి రామ్ చరణ్ నటించిన మూవీలు అమెరికాలోనూ భారీ కలెక్షన్స్ ని రాబట్టాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సారి ఎన్నడూ రిలీజ్ చేయనంతగా ఈ మూవీకి అమెరికాలో అత్యధిక ధియోటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే థియోటర్స్ లిస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. దాదాపు ఒక్క అమెరికాలోనే 115 థియేటర్ లలో ఈ గోవిందుడు అందరివాడేలే మూవీని విడుదలచేయనున్నారు. వీటి సంఖ్య మరో పది వరకూ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, జయసుధ లు కీలక పాత్రలు చేశారు. మొత్తం మీద అమెరికాలో అత్యధిక థియోటర్స లో రిలీజ్ ఈ మూవీ, ప్రపంచ వ్యాప్తంగా 2000 థియోటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇంత భారీ హోప్స్ తో వస్తున్న ఈ చిత్రం రిజల్ట్ ఏంటో, కొద్ది గంటల్లోనే తెలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: