దసరాకు రావలసిన ‘కరెంటు తీగ’ తన కన్నా ఎక్కువ పవర్ పాస్ చేస్తున్న ‘గోవిందుడు’ పవర్ కు తన కరెంటుతీగలు కాలిపోతాయి అన్న భయంతో దీపావళికి ఒక వారం ముందు అక్టోబర్ 17న హడావిడి చేయ బోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆడియో సక్సెస్ కు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ ను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పాటలు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని టీ స్టాల్స్ మొదలుకుని అమెరికాలోని క్లబ్బుల వరకు ఈ సినిమా పాటల క్రేజ్ నడుస్తోంది అనే వార్తలు వినపడుతున్నాయి. అచ్చు సంగీత దర్సకత్వం లో వచ్చిన ఈ ఆడియో శ్రోతలను విశేషంగా అలరిస్తూ ఆడియో రేటింగ్స్ నెంబర్ వన్ గా వస్తోందని వార్తలు వినపడుతున్నాయి.   ముఖ్యం గా మనోజ్ స్వయంగా పాడిన ‘దేవదాస్ బ్రేకప్' సాంగ్ యూత్ కు బాగా నచ్చింది అనే వార్తలు వస్తున్నాయి. ఈ పాటకు సోషల్ మీడియాలో సైతం లక్షల సంఖ్యలో లైకులు రావడం మంచు కుటుంబాన్ని జోష్ లో ముంచేస్తోంది అనే వార్తలు వినపడుతున్నాయి. టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాల హడావడి అంతా కరెంట్ తీగ విడుదల సమయానికి పూర్తి అయి పోతుంది కాబట్టి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మనోజ్ కోరుకుంటున్న బ్రేక్ వచ్చినట్లే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: