ఒరిస్సా మోడల్ గా ఆ రాష్ట్రంలో పేరున్న అనీష టాలీవుడ్ లో ‘అలియాస్ జానకి’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. చాలామంది అమ్మాయిలు లాగే ఈమెకు కూడా పవన్ అంటే వీరాభిమానం. అయితే ఈమె లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ను కలిసానని ఆరోజు తన జీవితంలో అద్భుతo జరిగిన రోజు అంటూ ఉప్పొంగి పోతూ తన ట్విటర్ లో పవన్ తో తీయించుకున్న ఫోటోను పెట్టడమే కాకుండా ఇలాంటి రోజు కోసమే తాను ఎదురు చూస్తున్నాను అంటూ ట్విట్ చేసింది. అయితే పవన్ ఈ ఫోటోలో కనిపిస్తున్న లుక్ ‘గోపాల గోపాల’ కు సంబందించిందా అని అనిపించేడట్లుగా ఈఫోటో ఉంది. పవన్ గోపాలుడి లుక్ బయటకు రాకుండా నిర్మాతలు జాగ్రత్త పడుతూ ఉంటె పవన్ వీరాభిమాని హీరోయిన్ అనీష తన ట్విటర్ లో పెట్టిన ఫోటో నిజంగా పవన్ గోపాలుడి లుక్ కు సంబంధించింది అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాకుండానే అనీష బయట పెట్టింది అనుకోవాలి.  ప్రస్తుతం ఈమె ‘అరెరే’, ‘పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డాడు’ సినిమాలలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: