పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ గోపాల గోపాల. గోపాల గోపాల మూవీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గెటప్ పై ఇండస్ట్రీలోనూ ఆసక్తి మొదలైంది. అలాగే అటు పవన్ ఫ్యాన్స్ లోనూ, ఇటు సాధారణ సినీ జనాల్లో పవన్ కళ్యాణ్, గోపాల గోపాల మూవీ గెటప్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన గోపాల గోపాల మూవీ గెటప్ ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’ చిత్రంలో మోడరన్ శ్రీకృష్ణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీ చిత్రం ‘ఓ మై గాడ్’లో అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. ‘గోపాల గోపాల’ షూటింగ్ గ్యాప్ లో పవన్ తో కలసి కొందరు అభిమానులు ఫోటో దిగారు. అభిమానుల మొబైల్ ఫోన్స్ నుండి ఈ ఫోటో లీకై బయటకు వచ్చింది. పవన్ కళ్యణ్ కనిపిస్తున్న ఈ ఫోటోలో లేత గులాబీ రంగు షర్టు, పైన నల్ల కోటుతో పవన్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ లుక్ ‘గోపాల గోపాల’లో ఇలానే ఉండొచ్చని ఇండస్ట్రీలోని వారు కన్ ఫర్మ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్ జంటగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీపై బిజినెస్ వర్గాల్లోనూ హైప్ క్రియేట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: