సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్యమంత్రిగా పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నాడా? అంటే ఈ వార్తలు దాదాపు నిజం అనే అంటున్నాయి తమిళ వర్గాలు. ఎందుకంటే సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాలలోకి రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుండో కోరుతున్నారు. తను రాజకీయాలలోకి వచ్చి, స్వచ్ఛమైన రాజకీయ సేవలు అందించాలని, తమిళ నాట అధిక సంఖ్యలో ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ప్రతిసారి వారి కోరికను రజిని సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నారు. రాజకీయాలలో అడుగుపెట్టే ఉద్దేశ్యం తనకు లేదని పలుమార్లు, బహిరంగ సభల్లో వెల్లడించారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి, జయలలిత అరెస్ట్ తో మరోసారి రజనీకాంత్ రాజకీయాలలోకి రావాలనే కోరిక తమిళనాట బలంగా వినిపిస్తుంది.అమ్మ అరెస్ట్ తర్వాత ప్రస్తుత తమిళ రాజకీయాలపై మీడియాలో జరిగే చర్చలలో రజినీకాంత్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. రజినీకాంత్ అభిమానులు సైతం తలైవా రాజకీయ అర్రంగేట్రానికి ఇదే సరైన సమయం అంటున్నారు. రజనీకాంత్ ప్రస్తుతానికి ఏ విధమైన కామెంట్ చేయనప్పటికీ, కచ్ఛితంగా రాజకీయాలలోకి వచ్చే అవకాశం అయితే ఉందని అంటున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ 63 ఏళ్ళ వయసులో ఈ రాజకీయాలలోకి అడుగుపెడతాడా? లేదా? అనే సర్వత్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ లింగా మూవీకి సంబంధించిన షూటింగ్ లో బిజిగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: