ప్రస్తుతం మంచు కుటుంబ సభ్యుడిగా మారిన రామ్ గోపాల్ వర్మ, మంచులక్ష్మి పాదం పై షార్ట్ ఫిలిం తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ షార్ట్ ఫిలిం షూటింగ్ పూర్తి చేసిన వర్మ ఈ సినిమాకు ‘మంచులక్ష్మి పాదం వద్ద ఒకరోజు’ అనే వెరైటీ టైటిల్ కూడా పెట్టేసాడు. ఈనెల 8వ తారీఖున జరగబోతున్న మంచులక్ష్మి పుట్టినరోజునాడు ఈ షార్ట్ ఫిలింను యూట్యూబ్ లో పెట్టి సంచలనం చేస్తాడట వర్మ. అయితే వర్మ చేస్తున్న ఈ లేటెస్ట్ ప్రయోగం పై అప్పుడే సెటైర్లు మొదలయ్యాయి. అవకాశాల కోసం ఎదురు చూసే యంగ్ డైరెక్టర్లు షార్ట్ ఫిలిమ్స్ ను తీసి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లుగా టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా టాప్ డైరెక్టర్ గా పేరు గాంచిన వర్మ ఇటువంటి ప్రయోగాలు చేయడం ఏమిటి అంటూ విమర్శల దాడి మొదలైంది. గతంలో ఏ అనుభవం లేకుండా నాగ్ వంటి స్టార్ తో ‘శివ’ లాంటి సినిమా తీసిన వర్మ బాలీవుడ్ వెళ్లి అమితాబ్ లాంటి లెజెండ్ ను డైరక్ట్ చేసాడు. అయితే ఇవన్నీ మరిచిపోయి రివర్స్ గేర్ లో భారీ సినిమాల నుండి షార్ట్ ఫిలిమ్స్ వైపు వర్మ అడుగులు వేయడం ఆశ్చర్య కరంగా ఉండటమే కాకుండా ప్రస్తుతం వర్మ ప్రయోగాలకు వర్మ అభిమానుల మైండ్ కూడా బ్లాంక్ అవుతోంది.  అయితే ఇవేమీ పట్టించుకోని వర్మ మంచు లక్ష్మి పాదం పై అద్భుతాన్ని చూపెడతాను అంటున్నాడు. ఆ అద్భుతం ఏమిటి అన్నది చూడాలి అంటే మంచులక్ష్మి పుట్టినరోజు వరకు ఆగాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: