మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 7 సినిమాల ప్రయాణంలో ఫ్లాప్స్ కంటే బ్లాక్ బస్టర్ హిట్సే ఎక్కువ. ఇప్పటి వరకూ వరుసగా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో వరుస హిట్స్ అందుకున్న రామ్ చరణ్ మొదటి సారిగా యాక్షన్ అనేది పూర్తిగా పక్కనబెట్టి చేసిన పూర్తి కుటుంబ కథా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. దసరా కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ స్పెషలిస్టు అయిన కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. కాజల్ అగర్వాల్, శ్రీ కాంత్, ప్రకాష్ రాజ్, కమలినీ ముఖర్జీ, జయసుధ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాని బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో కూడా హిట్ అందుకుంటానని నమ్మకంగా ఉన్న చరణ్ ఆశలు సజీవంగా నిలిచాయని టాలీవుడ్ అంటుంది. ఎందుకటే ఇప్పటి వరకూ టాప్ హీరోలు నటించిన ఎనిమిదవ చిత్రం, ఘోర డిజాస్టర్స్ ని చూస్తే రామ్ చరణ్ నటిచిన ఈ 8వ చిత్రం గోవిందుడు అందరివాడేలే మాత్రం గ్రాండ్ సక్సెస్ ని ఇచ్చింది. రామ్ చరణ్ చెప్పినట్టుగానే 8వ సినిమా ఫ్లాప్ అనే ఫోభియాని ఈ ‘గోవిందుడు అందరివాడేలే’ తో బ్రేక్ చేసాడు. ఈ గోవిందుడు అందరివాడే సక్సెస్ టాక్ తో, టాప్ హీరోలకు రామ్ చరణ్ ఝలక్ ఇచ్చాడనే చెప్పాలి. ప్రస్తుతం చిత్ర యూనిట్ గోవిందుడు అందరివాడేలే సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తెలుగు ప్రేక్షకులు పది కాలాల పాటు మనసుకు హత్తుకునే సినిమాగా, రాబోవు తరాలకి కుటుంబ బాంధవ్యాల విలువను చాటిచెప్పే ఓ మరువలేని సినిమాగా తెలుగు చలన చిత్ర రంగంలో నిలిచిపోతుందని నిర్మాత బండ్ల గణేష్ మరోసారి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: