గోవిందుడు అందరివాడేలే’ సినిమాకు రివ్యూలు బాగా వచ్చినా సగటు ప్రేక్షకుడి స్పందన అంతంత మాత్రంగానే ఉండటమే కాకుండా ‘గోవిందుడు’ తాతయ్య ఇంటికిదారేదిలా మారింది అని కామెంట్లు ఇస్తున్నాడు. దీనితో ఈ సినిమా బంపర్ హిట్ కాదు అని తేలిపోవడంతో దసరా తరువాత వచ్చే చిన్న సినిమాలకు దారి దొరికి ఊపిరి పీల్చు కుంటున్నాయి. రాజమౌళి బ్యాక్ బోన్ గా నిలిచే వారాహి చలన చిత్ర బ్యానర్ నిర్మించిన 'దిక్కులు చూడకు రామయ్యా' సినిమాను అక్టోబర్ 10న రాజమౌళి పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమాను రాజమౌళి శిష్యుడు త్రికోటి దర్శకత్వం వహించినా ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో రాజమౌళి సలహాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతోంది. ‘ఈగ’, ‘లెజెండ్’ లాంటి భారీ సినిమాలనే కాకుండా ఈ సంవత్సరం విడుదలై మంచి సినిమాగా టాక్ తెచ్చుకున్న ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా కూడా ఈ బ్యానర్ నుంచే రావడంతో చిన్న సినిమాగా వస్తున్నా ‘దిక్కులు చూడకు రామయ్య’ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా రామ్ చరణ్ తన మాస్ హీరో ఇమేజ్ నుండి నటుడిగా తనను తాను నిరూపించు కోవడానికి ‘గోవిందుడు అందరివాడేలే’ పడ్డ కష్టానికి సరైన ఫలితం విమర్శకుల వద్ద నుండి రాలేదని వార్తలు వినపడుతున్నాయి. రామ్ చరణ్ ప్రకాష్ రాజ్ ముందు క్లైమాక్స్ లో తన ఫీలింగ్స్ ను చూపెట్టడంలో తేలిపోవడంతో రామ్ చరణ్ ఈ తరహా పాత్రలకు నప్పుతాడా అన్న చర్చ మళ్ళీ మొదలైంది.  అదేవిధంగా రామ్ చరణ్ కాస్త హైట్ తక్కువ అందువలన షార్ట్ లు నప్పవు అలాంటిది ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లాంటి పర్సనాలిటీల నడుమ షార్ట్ లు, చిన్న పిలక వేసి, నటిస్తూ ‘గోవిందుడు’ సినిమాలో కనిపిస్తూ ఉన్న సన్నివేశాలను చూసి సగటు ప్రేక్షకుడు చరణ్ చిన్నపిల్లవాడు లుక్ లో ఉన్నాడు అని కామెంట్స్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు చరణ్ పిలక కోసం జుట్టు తగ్గించడంతో ఆ లుక్ క్లాస్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది కాని మాస్ ప్రేక్షకులకు చరణ్ లుక్ అంతగా రుచించలేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఏమైనా ‘గోవిందుడు’ బ్లాక్ బస్టర్ కాకపోవడం ఈ సినిమా తరువాత విడుదల అయ్యే చిన్న సినిమాలకు పండుగలా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: