నిన్న విడుదలైన గోవిందుడు అందరివాడేలే సినిమాలో ఎమోషనల్ సీన్స్ పెరిగి పోయి సగటు ప్రేక్షకుడు కోరుకునే హాస్యం పాలు తగ్గి పోవడానికి గల కారణం ఈ సినిమా ఎడిటింగ్ లో చిరంజీవి చూపెట్టిన అతి జాగ్రత్త అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎమ్. ఎస్.నారాయణ నుండి పోసాని కృష్ణ మురళీ వరకు చాలామంది కమెడియన్స్ ను పెట్టుకున్నా కృష్ణవంశీ అనుకున్న రిజల్ట్ రాబట్ట లేకపోవడానికి ఒక కారణం ఉంది అనే ప్రచారం జరుగుతోంది. ఫిలిం నగర్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఎమ్.ఎస్, పోసానిల పై కొన్ని కామిడీ సీన్స్ ను మరి కొంతమంది హాస్య నటులతో కలిపి కృష్ణవంశీ ‘గోవిందుడు’ సినిమా గురించి షూట్ చేసినా ఆసీన్స్ అన్నీ ఫైనల్ ఎడిటింగ్ లో ఎడిట్ అయిపోయాయి అనే వార్తలు విశ్వసనీయంగా వినపడుతున్నాయి.  ఫైనల్ ఎడిటింగ్ కు వెళ్ళే ముందు పూర్తి సినిమాను చూసిన చిరంజీవి ఫోకస్ అంతా రామ్ చరణ్, ప్రకాష్ రాజ్ ల పాత్రల పై పెట్టండి అని సంకేతాలు ఇవ్వడంతో ఈ సినిమాలో కామెడీ సీన్స్ ఎక్కువైతే ఎమోషనల్ సీన్స్ బరువు తగ్గి పోతుంది అన్న భయంతో కృష్ణవంశీ షూట్ చేసిన హాస్య సన్నివేశాలను కలప కుండా వదిలేసాడు అనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు ఇలా ఉండగా అమెరికాలోని తెలుగు వారికి ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా బాగా నచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రీమియర్ షోకు సంబంధించి అమెరికాలోని దాదాపు 60 స్క్రీన్స్ పై స్పెషల్ షోలు వేయడం జరగడంతో మంగళవారం రాత్రి వీకెండ్ కాకపోయినా తెలుగు ప్రేక్షకులు ఈ ప్రీమియర్ షోలకు అధిక సంఖ్యలో రావడమే కాకుండా ఈ సినిమా ఫై మంచి టాక్ ను ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: