ఈరోజు ఎన్నో భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న ‘బ్యాంగ్ బ్యాంగ్’ హీరో హృతిక్ రోషన్ ఒక వెరైటీ ఛాలెంజ్ ని బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ కు వదిలాడు. ఈమధ్య తన ‘పీకే’ సినిమా కోసం అమీర్ ఖాన్ రైలు పట్టాల పై దిగంబరంగా నిలబడి ఒక రేడియోను అడ్డు పెట్టుకుని విడుదల చేసిన ‘పీకే’ సినిమా పోస్టర్ సంచలనంగా మారడమే కాకుండా ఈ పోస్టర్ పై వివాదాలు ముదిరి న్యాయస్థానాల వరకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కోర్టులు కూడా ఏమీ చేయలేము అంటూ చేతులెత్తేసాయి. ఈ వ్యవహారం ఇక్కడితో సద్దుమణిగింది అని అందరూ అనుకుంటున్న నేపధ్యంలో హృతిక్ రోషన్ తాజాగా అమీర్ ఖాన్ కు ఒక కొత్త సవాల్ విసిరాడు. దమ్ముంటే రేడియో అడ్డు తీసివేసి నిలబడి చూపెట్టు అప్పుడు మెచ్చు కుంటాను అని అమీర్ కు సవాల్ విసిరాడు హృతిక్. దానికి అమీర్ ఖాన్ స్పందిస్తూ రేడియో తీసివేసి హృతిక్ కోరుకున్నట్లుగా నగ్నంగా నిలబడి ఫోటో తీయించుకుని పంపుతాను అయితే ఆ తరువాత ఆఫోటో చూసి హృతిక్ ఏమైనా అయితే తన బాధ్యత లేదు అంటూ వేసిన సెటైర్ ఇప్పుడు బాలీవుడ్ కు హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి పాత్రనైనా అతి సునాయాసంగా చేసే అమీర్ ఖాన్ కు హృతిక్ కోరిన కోరిక పెద్ద విషయం కాదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: