త్రివిక్రమ్ తీసే సినిమాలలో బ్రహ్మానందంతో పాటు నటి హేమకు కూడా ఎదో ఒక పాత్ర క్రియేట్ చేయడం ఆయన అలవాటు. ‘అతడు’ సినిమాలో బ్రహ్మీ భార్యగా నటించిన హేమకు మంచి పేరు రావడంతో ఆ తరువాత వచ్చిన త్రివిక్రమ్ సినిమాలలో హేమ పాత్ర చిన్నదైనా ఉంటూనే ఉంది.  టాలీవుడ్ రికార్డులను తిరగ రాసిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో కూడా హేమ సందడి ఉంది. ఈ కృతజ్ఞత వలనే కాబోలు హేమ త్రివిక్రమ్ తనకు ఒక గాడ్ ఫాదర్ లాంటి వాడు అంటూ కామెంట్స్ చేస్తోంది. అంతేకాదు తామిద్దరం మంచి స్నేహితులం అని చెపుతూ ఆయన సినిమాలో చిన్న పాత్ర చేస్తే చాలు అ తరువాత 100 సినిమా ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేసింది హేమ.  తాను ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక ప్రముఖ నటిగా గుర్తింపు పొందడానికి త్రివిక్రమ్ తన కోసం సృస్టించిన పాత్రలే అని చెపుతోంది హేమ. మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ ను తన మాటలతో మరింత పొగుడ్తూ త్రివిక్రమ్ పొగడ్తల భజన చేస్తున్న హేమ, ఎత్తుగడ ఫలించి బన్నీతో తీస్తున్న కొత్త సినిమాలో హేమకోసం ఎటువంటి పాత్రను సృస్టిస్తాడో చూడాలి...   

మరింత సమాచారం తెలుసుకోండి: