ప్రస్తుతం నిర్మాణం తుది దశకు చేరుకున్న ‘గోపాల గోపాల’ సినిమాకు సంబంధించి ఒక హాట్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో గోపాలుడిగా నటిస్తున్న పవన్, దేవుడినే కోర్టు మెట్లు ఎక్కించిన వ్యక్తి వెంకటేష్ కలిసి ఒక స్పెషల్ సాంగ్ ను చేయబోతున్నారని టాక్.  ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ పూర్తి అయిన తరువాత ఈ సాంగ్ లోని కొన్ని సన్నివేశాలను గోపాలుడి ఫస్ట్ లుక్ టీజర్ గా తీసుకువద్దామని ఈ సినిమా దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. కృష్ణాష్టమి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించే ఈ స్పెషల్ సాంగ్ ను మొదట మరొక ప్రముఖ హీరోతో చేయిద్దామని అనుకున్నారట.  అయితే స్పెషల్ సాంగ్ వేరే హీరో ఎవరో చేయడం కన్నా పవన్, వెంకటేష్ లపై చిత్రీకరిస్తే ఈ సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడి బయ్యర్లలో మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టి తద్వారా నిర్మాతలకు కాసుల వర్షo కురిపిస్తుందన్న ఆలోచనలతో ఈ మార్పు చేసారని అంటున్నారు. కృష్ణ తత్వాన్ని తెలియ పరిచే విధంగా ఒక ప్రముఖ గేయ రచయితచేత ఈ పాటను రాయించి రెడీ పెట్టారని సమాచారం.  సామాన్యంగా పవన్ డాన్స్ చేస్తే ధియేటర్లలోని ప్రేక్షకుల హడావిడి మాటలకందనిది. అటువంటిది పవన్, వెంకటేష్ లు కలిసి ఒకే పాటకు స్టెప్స్ వేస్తే వచ్చే క్రేజ్ నిజంగా పవన్ అభిమానులకు పండుగానే అనుకోవాలి...  

మరింత సమాచారం తెలుసుకోండి: