ప్రతి విషయంలో చాలా విభిన్నంగా వ్యవహరించే పవన్ కళ్యాణ్ పిల్లలు కూడా చాలా విభిన్నంగా పెరుగు తున్నారు అనే విషయాన్ని ఫోటో రూపంలో రేణుదేశాయ్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. చిన్న పిల్లలకు దీపావళి అన్నా ఆరోజు కాల్చుకునే బాణా సంచా అన్నా ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే.  ఈ సరదా కోసం పిల్లలు సరదాగా వారి ఇళ్ళలో చిన్నచిన్న బాణా సంచాను తయారు చేస్తూ ఉంటారు. అయితే రేణు దేశాయ్ మాత్రం దీనికి భిన్నంగా తన పిల్లలు అకిరా నందన్, ఆద్యలు చేత మట్టి ప్రమిదలు స్వయంగా వారి చేత చేయిస్తూ మన సంస్కృతిని వారికి తెలిసేదట్లుగా చేస్తోంది రేణు.  మారిపోయిన ఈ కాలంలో రకరకాల మోడల్స్ లో తాయారు అవుతున్న ప్రమిదలను, కోవ్వుత్తులను బజార్లో కొంటూ పండుగ చేసుకుంటున్నారు. కాని మట్టి ప్రమిదల సంగతి నగరాలలో నివసించే వారు చాలామంది మరిచిపోయారు. అయితే పవన్ పిల్లలు మాత్రం తమ తల్లి కోరిక మేరకు తాము మట్టితో తయారు చేస్తున్న ప్రమిదలతో దీపాలు పెట్టడానికి ఇలా సరదాగా కష్టపడుతూ దీపావళి హంగామాకు అప్పుడే శ్రీకారం చుట్టేశారు.  తమ తండ్రి పవన్ తన ఫామ్ హౌస్ లో వ్యవసాయం పనులు ఇష్టపడి చేస్తూ ఉంటే ఆ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ పవన్ పిల్లలు ఇలా ప్రమిదల తయారీలో బిజీగా ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: