మనసులో అనుకున్న మాటను తన తండ్రి కమల్ హాసన్ లాగే ఎటువంటి మొహమాటాలు లేకుండా బయటకు వ్యక్త పరుస్తుంది శ్రుతిహాసన్. సినిమా ప్రపంచంలో పురుషాధిక్యత గురించి ఈ మధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక్క సినిమా ప్రపంచంలోనే కాదు అన్ని రంగాల్లోనూ పురుషులదే పైచేయి అంటూ శ్రుతి తన కోపాన్ని ప్రదర్శిస్తోంది. ఆడవాళ్లు అణిగి మణిగి పడి ఉండాలని మగవాళ్లు కోరుకుంటారనీ, అంత మాత్రాన తగ్గాల్సిన అవసరంలేదనీ శ్రుతీ హాసన్ అభిప్రాయ పడింది. సినిమా నటి, పాత్రికేయురాలు, అధ్యాపకురాలు, గృహిణి ఇలా ఏరూపంలో ఉన్న మహిళకైనా, ఈ దేశంలో రక్షణ లేదు అంటూ కామెంట్స్ చేసింది శ్రుతి. ఈ దేశంలో వృత్తిరీత్యా హోటల్లోనో లేక గెస్ట్ హౌస్‌లోనో ఉన్నా రక్షణ ఉంటుందని గ్యారంటి లేదు అని అంటూ కామెంట్లు విసిరింది శ్రుతిహాసన్. అందువల్లనే మహిళలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి అంటూ పిలుపును ఇస్తోంది ఈ తేనె కళ్ళ సుందరి. అంతేకాదు ఈ దేశంలో వయసులో ఉన్నవాళ్లకే కాదు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికీ ఇండియాలో రక్షణ లేదు అంటూ శ్రుతి చేస్తున్న కామెంట్స్ చాలా మందికి షాకింగ్ గా మారాయి. అయితే టాప్ హీరోలతో స్టెప్స్ వేస్తూ ఎక్స్ పోజింగ్ చేసే శ్రుతిహాసన్ కు మగ వారి పై ఇంతకోపం ఎందుకు వచ్చిందో క్లారిటీ లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: