కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ‘బాహుబలి’ సినిమాలోని ప్రభాస్ పోస్టర్ కు ప్రభాస్ అభిమానుల నుండి మంచి ప్రశంసలు వస్తున్నాయి. కండలు తిరిగిన యోధిడిగా కనిపిస్తున్న ప్రభాస్ లుక్ కు ప్రభాస్ అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.  ప్రభాస్ కు ఉన్న లక్షలాది అభిమానులలో ఇక లేటెస్ట్ గా అల్లుఅర్జున్ కూడా చేరిపోయాడు. ‘బాహుబలి’ లోని ప్రభాస్ వారియర్ లుక్ అదిరి పోయింది అంటూ కామెంట్లు రాసి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. రేపు జరగబోతున్న ప్రభాస్ పుట్టిన రోజుకు ముందుగానే తన అభినందనలు తెలియచేస్తూ “నా డీయరెస్ట్ డార్లింగ్‌కి అడ్వాన్స్‌డ్ హ్యాపీ బర్త్‌డే" అంటూ శుభాకాంక్షలు తెలియచేసాడు.  కొన్ని రోజుల క్రితమే వీరత్వంతో కూడిన, గోనగోన్నారెడ్డి లుక్ లో ‘రుద్రమదేవి’ కోసం రఫ్ లుక్ లో సందడి చేసిన అల్లుఅర్జున్ అదే వీరత్వంతో కండల యోధుడిగా ‘బాహుబలి’ కోసం కనిపిస్తున్న ప్రభాస్ ను అభినందించడం ద్వారా టాలీవుడ్ యంగ్ హీరోల మధ్య ఎంత పోటీ ఉన్నా, ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు అంటూ అల్లుఅర్జున్ పై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు.  దీపావళి రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రభాస్ కు దీపావళి సరదాలతో పాటు తోటి హీరో స్టైలిష్ స్టార్ బన్నీ ఇచ్చిన అభినందనలు ప్రభాస్ ను మరింత జోష్ లో ఉంచుతాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: