బాలీవుడ్ సినిమాల కలెక్షన్స్ రికార్డులను బ్రేక్ చేసుకునే విషయంలో బాలీవుడ్ టాప్ హీరోలు సల్మాన్, షారుఖ్, అమీర్ ల మధ్య పోటీ రోజురోజుకు ఒక సరి కొత్త సంచలనం సృష్టిస్తోంది. కేవలం ట్రాన్సిస్టర్ ను అడ్డు పెట్టుకుని నగ్నంగా నిలబడి తన'పీకే' కోసం ఇప్పటికే సంచలనం సృష్టిo చిన అమీర్ ఖాన్ దీపావళి సందర్భంగా తన 'పీకే' టీజర్‌ విడుదల చేసి మరో సంచలనం చేసాడు.  ఇప్పటివరకు పోస్టర్లతో ప్రేక్షకులకు ఆకట్టుకున్న ఈవిలక్షణ నటుడు ఈ టీజర్‌ చేసిన విన్యాసాలు అన్నీఇన్నీకావు . ఈ సినిమాలో తాను వేస్తున్న గెటప్స్ అన్నింటినీ చూపించాడు. ఈ టీజర్‌ చూస్తూ ఉంటే ఈ సినిమా ఇటు క్లాస్, అటు మాస్‌ని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.  ఈ ట్రైలర్‌కు నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందనే వచ్చింది. కేవలం 19 గంటల్లో 8 లక్షలకు పైగా హిట్స్ వచ్చాయి. తనకు కలిసి వచ్చే క్రిస్మస్‌ సెంటిమెంట్ తో ఈ సినిమాను రాబోతున్న డిసెంబర్ కు విడుదల చేయబోతున్నారు. రాజ్‌కుమార్ హిరానీ డైరెక్ట్ చేస్తున్న ఈచిత్రంలో అమీర్ సరసన అనుష్కశర్మ హీరోయిన్.  గతంలో రాజ్‌కుమార్ హిరానీ తీసిన మున్నాబాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నా‌భాయ్, 3 ఇడియట్స్ వంటి మూవీలు ఊహించని విధంగా బాక్సాఫీసు వద్ద కొత్త రికార్డులను సృష్టిoచాయి. అదే నేపధ్యాన్ని కొనసాగిస్తూ అమీర్ కలలు గంటున్న 500 కోట్ల రికార్డును ఈ సినిమా అందుకుoదో లేదోఅన్న విషయం రాబోతున్న క్రిస్మస్ తేల్చ నుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: