నిన్న దీపావళి రోజు బాణాన్ని అర్జునుడిలా ఎక్కి పెడుతూ ప్రభాస్ ‘బాహుబలి’ లుక్ ను రాజమౌళి విడుదల చేసినా ప్రభాస్ అభిమానులకు సంతృప్తి కలగలేదు అనే వార్తలు రాజమౌళి దృష్టికి రావడంతో జక్కన్న వెంటనే స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టాడు.  నిన్న దీపావళి రోజు ప్రభాస్ పుట్టినరోజు కూడా కావడంతో ప్రభాస్ పాత్రకు సంబంధించి ‘బాహుబలి’ మరో మేకింగ్ వీడియో వస్తుందని ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తే చివరకు బాణాన్ని ఎక్కిపెట్టిన ఫోటోతో సరిపెట్టడంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర అసహనానికి లోనయ్యారు.  అయితే జరిగిన పొరపాటును గ్రహించిన రాజమౌళి ప్రభాస్ అభిమానులను కూల్ చేయడానికి ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసి అందులో ఎప్పటిలాగే రాజమౌళి చాల కూల్ గా మాట్లాడాడు. మీ హీరోని రెండేళ్లుగా మీకు దూరం చేశాను అని అంటూ ఒక పెద్ద సినిమా అందించాలనే ఉద్దేశంతో ఆలస్యం అయ్యిందని అని చెపుతూ ‘బాహుబలి’ రిలీజ్ అయ్యాక ఆ కోపం మర్చిపోతారు అని అంటూ షూటింగ్ పని ఒత్తిడి వల్ల బాహుబలి లోని ప్రభాస్ పాత్రకు సంభందించి మేకింగ్ వీడియో తయారు చేయలేకపోయానని క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి.  అయితే రాజమౌళి నిజంగా షూటింగ్ పని ఒత్తిడి వల్ల ఇలా చేసాడా? లేదంటే బాహుబలి మొదటి మేకింగ్ వీడియో విడుదల అయిన తరువాత అది ఒక హాలీవుడ్ సినిమాకు కాపీ అని విమర్శలు రావడంతో రాజమౌళి వ్యూహాత్మకంగా ఇలా వ్యహరిoచాడా? అనే విషయం రానున్న రోజులలో తేలుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: