మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహిద్దామని టాప్ డైరక్టర్ల దగ్గర నుంచి యంగ్ డైరక్టర్ల వరకు అందరు చిరంజీవి ఇంటిముందు క్యూ కడుతూ ఉంటే తన ఇంటికి వస్తున్న దర్శకులతో చెస్ గేమ్ ఆడుతూ చిరంజీవి రోజులు గడిపేస్తున్నాడు. ఈమధ్య చిరంజీవిని కలిసిన కొంతమంది ప్రముఖుల వద్ద నేటి దర్శకుల పై కొన్ని కామెంట్లు వదిలాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ ఆంగ్ల దినపత్రిక రాసిన కధనం ప్రకారం చిరంజీవి తనను కలిసిన సన్నిహితులతో మాట్లాడుతూ తన 150వ సినిమా స్థాయికి తగ్గ సినిమా కధను తయారు చేసి డైరెక్ట్ చేసే సత్తా ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఏ దర్శకుడిలోను కనిపించడం లేదు అంటూ కామెంట్స్ చేసాడని ఆ పత్రిక కధనం.  అదేవిధంగా ప్రస్తుతం ఉన్న దర్శకుల స్థాయి పై నమ్మకం లేక తన కొడుకు చరణ్ నటించిన ‘నాయక్’, ‘ఎవడు’, ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాల విషయంలో కూడా ప్రతి విషయం తాను చూసుకో వలసి వచ్చింది అని కామెంట్లు విసిరినట్లు టాక్. చిరంజీవి విసిరిన కామెంట్లను బట్టి చూస్తూ ఉంటే ఇక ఏ దర్శకుడు నచ్చక చిరంజీవి స్వయంగా తన 150వ సినిమాకు తానే దర్శకుడిగా మారినా ఆశ్చర్యంలేదు అంటూ కొంతమంది అప్పుడే చిరంజీవి పై సెటైర్లు మొదలు పెట్టాసారట... 

మరింత సమాచారం తెలుసుకోండి: