అనుక్షణం టాప్ హీరోల భజన చేస్తూ ఆ హీరోలు అడగకుండానే భారీ పారితోషికాలు ఇస్తూ అందరి మైండ్ బ్లాక్ చేసే బండ్ల గణేష్ తాను ప్రస్తుతం జూనియర్, పూరీల కాంబినేషన్ లో నిర్మిస్తున్న కొత్త సినిమా విషయంలో వ్యవహరిస్తున్న శైలి అందరికీ ఆశ్చర్యకరంగా మారింది. ఈ సినిమా ప్రారంభం నుండి రకరకాల సమస్యలతో మొదలైన విషయం తెలిసిందే. ఈ మధ్య బండ్ల గణేష్ నిర్మించిన భారీ సినిమాలు ఏమి సూపర్ హిట్లు కాకపోవడంతో బయ్యర్ల నుండి సమస్యలు ఎదుర్కుంటున్న బండ్ల గణేష్ జూనియర్ తో తాను తీస్తున్న సినిమా విషయoలో చాలా పొదుపు చర్యలు చేపట్టడమే కాకుండా జూనియర్, పూరీలను తమ పారితోషిక విషయంలో ఇంకా భారీగా తగ్గించుకోమని ఒత్తిడి చేస్తున్నట్లు టాక్.  ఈ విషయమై బండ్ల గణేష్ కు జూనియార్, పూరీలకు మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరడంతో బండ్ల గణేష్ షూటింగ్ పూర్తి అయ్యాక ప్రతిరోజు ఇచ్చే ప్రొడక్షన్ పెమెంట్లు కూడా ఆపి వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనితో విసిగేత్తి పోయిన పూరి, జూనియర్లు ఈ సినిమా నిర్మాణ బాధ్యత నుండి బండ్ల గణేష్ ను తప్పించి తాము ఇరువురు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తే ఎలా ఉంటుంది అన్న విషయం పై తీవ్రంగా ఆలోచనలు జరుపుతున్నట్లుగా టాక్. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ నేలాఖరకు కాని లేదా వచ్చే నెలకాని విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈ వార్ కు సంబంధించిన అసలు విషయం పై క్లారిటీ ఆ సమయానికి వస్తుంది అని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: