టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉయ్యాల జంపాల మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రి ఇచ్చిన బుల్లితెర బ్యూటీ, అవికాగోర్. చిన్నారి పెళ్ళికూతురి సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల అపార అభిమానాన్ని చూరగొన్న ఈ యాక్టర్, తన తొలి మూవీ ఉయ్యాల జంపాల మూవీతోనూ అంతే ప్రేక్షక ఆధరణను పొందింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అవికాగోర్ తన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన షూటింగ్ లో బిజిగా ఉంది. అయితే తాజాగా అవికాగోర్ ని ఓ మ్యాగజైన్ పలకరించింది. ఆ మ్యాగజైన్ తో అవికాగోర్ ఇచ్చిన స్పెషల్ ఇంటర్వూ అనంతరం, అవికాగోర్ ఆ మ్యాగజైన్ కి షాకింగ్ న్యూస్ ఇచ్చింది. అయితే అది మ్యాగజైన్ కి షాకింగ్ అయినప్పటికీ, వారు తెగ సంతోషపడే విషయమే. తను ఓ హాట్ ఫోటోషూట్ చేయటానికి సిద్ధంగా ఉన్నట్టు తన మనసులోని మేటర్ ని ఈ బ్యూటి తెలియజేసింది. ఇంతకీ తను ఏ మ్యాగజైన్ తో హాట్ ఫోటోషూట్ చేయటానికి సిద్ధంగా ఉందో తెలుసా? అదే వోగ్ మ్యాగజైన్. ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది టాప్ బ్యూటీస్, ఈ మ్యాగజైన్ లో వారి అందాలను ఆరబోసి, ఎంతో పాపులర్ అయ్యారు. మన సౌత్ బ్యూటి ఇలియాన సైతం తన న్యూడ్ ఫోటోషూట్ ని ఈ మ్యాగజైన్ లోనే ఇచ్చి, బిటౌన్ ఇండస్ట్రీ ద్రుష్టిని తనవైపు మరల్చుకుంది. ఇప్పుడు అవికాగోర్ సైతం బిటౌన్ ఆఫర్స్ కోసం ప్రయత్నాలు మొదలు పెడుతుంది. అందులోని భాగంగానే తను ఓ హాట్ ఫోటోషూట్ ని వేదికగా చేసుకొని, బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీని అట్రాక్ట్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే అవకాగోర్ కి సంబంధించిన హాట్ ఫోటో షూటంగ్ స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో అవికాగోర్ అందాలు ఏ విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖలను అట్రాక్ట్ చేయబోతాయో తెలియాలంటే, ఆ హాట్ ఫోటోషూట్ బయటకు వచ్చే వరకూ వెయిట్ చెయ్యాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: