అమీర్ ఖాన్ విలక్షణంగా కనిపిస్తూ నటించిన ‘పీకే’ సినిమా ప్రమోషన్ కూడా చాల విభిన్నంగా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ మొన్న దీపావళినాడు విడుదలై లక్షల కొద్దీ హిట్లను కొద్ది గంటలలో సాధించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మొన్న ముంబాయ్ లో జరిగిన ఈసినిమ టీజర్ రిలీజ్ ఫంక్షన్ లో మీడియా ముందు అమీర్ ఖాన్ వేసిన సెటైర్లకు ఈ సినిమా హీరోయిన్ అనుష్క శర్మకు నోటమాట రాలేదు.  ‘పీకే’ సినిమా గురించి అమీర్ అన్ని విషయాలు మాట్లాడాక తన మైక్ ను ఈ సినిమా పై మరన్ని విషయాలు చెప్పవలసిందిగా అనుష్కకు ఇచ్చాడు. అయితే అంతమంది మీడియా వారిని చూసిన అనుష్క తాను ఈ సినిమా గురించి మాత్రమే మాట్లాడుతానని అంటూ క్రికెటర్ విరాట్ కోహ్లితో తన స్నేహం గురించి అడగవద్దు అంటూ తన మాటలు మొదలు పెట్టింది.  అయినా పట్టు విడవని మీడియా వారు అనుష్క, విరాట్ కొహ్లల ప్రేమ వ్యవహారం పై వరస పెట్టి ప్రశ్నలు అడగడంతో ఆ ప్రశ్నలకు ఇది వేదిక కాదు అంటూ తన అసహనాన్ని వ్యక్త పరిచి తప్పించుకోబోయింది.  అయితే చిలిపిగా మాట్లాడే అమీర్ ఖాన్ ఆ ఫంక్షన్ జరుగుతున్న వేదికకు ఎదురుగా ఉన్న మరో ఫంక్షన్ హాల్ ను చూపెడుతూ విరాట్ కొహ్లిని గురించి చెప్పడానికి ఎదురుగా కనిపిస్తున్న ఆ వేదిక సరిపోతుందా? అని అనుష్క పై సెటైర్ వేసే సరికి మీడియా వారికి నవ్వులు వస్తే అనుష్క బుగ్గలు మాత్రం కోపంతో ఎర్రబడ్డాయని మీడియా వార్తలు రాస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: