మొన్న విడుదలైన ‘కార్తికేయ’ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని విమర్శకుల నుండి ప్రశంసలు కూడా పొందుతున్నా ఈ సినిమా విజయం కలర్స్ స్వాతికి అంతగా కలిసి రాలేదా అనే మాటలు వినపడుతున్నాయి. దీనికి కారణం ఈ సినిమాలో స్వాతి కొద్దిగా లావుగా కనిపించడమే కాకుండా స్వాతిలోని గ్లామర్ లుక్స్ ఈ సినిమాలో చాల తక్కువగా కనపడటంతో ఈ కామెంట్స్ మొదలయ్యాయి.  క్యూట్ బ్యూటీగా కనిపించే స్వాతి ఈ సినిమాలో తన క్యూట్ లుక్ ను కోల్పోయి కొద్దిగా రఫ్ గా కనిపించడం స్వాతి అభిమానులకు షాకింగ్ గా మారింది. మంచి నటిగా పేరున్న స్వాతికి క్యూట్ హీరోయిన్ గా కూడా ఇమేజ్ ఉంది.  ఆ క్యూట్ లుక్ ‘కార్తికేయ’ సినిమాలో కనిపించక పోవడం ఆ సినిమా ఫోటో గ్రాఫర్ చేసిన పొరపాటా? లేదంటే స్వాతి అప్పుడే పెద్దదిగా కనపడుతోందా అని అంటూ విమర్శకుల విమర్శలతో పాటు సెటైర్లు కూడా మొదలయ్యాయి. వస్తున్న ఈ వార్తలను బట్టి ‘కార్తికేయ’ విజయం హీరో నిఖిల్ కు కలిసి వచ్చినంతగా స్వాతికి టాలీవుడ్ లో అవకాశాలు వచ్చే స్థాయిలో కలిసిరాదేమో అనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్త పరుస్తున్నారు. తమిళ, మలయాళ సినిమాలలో ఇప్పటికే ఎన్నో అవకాశాలు వస్తున్న స్వాతికి ‘కార్తికేయ’ విషయంలో సామాన్య ప్రేక్షకుల నుండి విమర్శకుల వరకు తన లుక్స్ పై వస్తున్న కామెంట్స్ షాకింగ్ గానే మారుతాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: