సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్వీట్ బ్యూటీ సమంత తెగ సంతోషంతో సంబరాలు జరుపుకుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే సమంత ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. దీనికి కారణం లేకపోలేదు. తొలిసారిగా తమిళంలో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నందుకు సమంత తెగ సంతోష పడుతుంది. దీపావళికి రిలీజైన 'కత్తి' సినిమా మంచి హిట్టవడంతో ఈ బ్యూటీ తెగ హ్యాపీగా ఫీలైపోతోంది. టాలీవుడ్ లో సమంత నెంబర్ వన్ పొజిషన్ అయినప్పటికీ, కోలీవుడ్ లో కత్తి మూవీ రిలీజ్ ముందు వరకూ ఫ్లాప్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. అలాగే తన ముందు, కోలీవుడ్ లో భారీ బడ్జెట్ ఫిల్మ్ ఉన్నాయి. ఈమధ్య విడుదలైన 'అంజాన్' సినిమా భారీ అపజయాన్ని పొందడంతో, అప్పట్లో ఆమె బాగా అప్సెట్ అయింది. ఈ ఎఫెక్ట్ తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ మీద పడటం ఖాయం అని తెగ బాధపడిపోతుంది. తమిళంలో సక్సెస్ అవ్వాలన్న కోరిక, కోరికలాగే మిగిలిపోతుందేమోనని సమంత భయపడింది కూడా. అయితే తాజాగా విజయ్ తో ఆమె చేసిన 'కత్తి' కలెక్షన్లలో రికార్డులు క్రియేట్ చేస్తుండడంతో అమ్మడు ఖుషీ అయిపోతోంది. ప్రస్తుతం అమెరికాలో వున్న ఈ చిన్నది ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ, అందరికీ థ్యాంక్స్ కూడా చెప్పింది. అంతే కాకుండా తను మరో సారి విజయ్ తో నటించేందుకు సిద్ధంగా ఉందని అఫిషియల్ గా చెప్పుకొచ్చింది. విజయ్ తో పని చేస్తున్నంత కాలం, తనకి సమయమే తెలియడం లేదంటూ, విజయ్ పై పొగడ్తల జల్లుని కురిపిస్తుంది. ఈ సంతోషంలో సమంత, విజయ్ కి ఓపెన్ ఆఫర్ కూడ ఇచ్చింది. ఒక వేళ విజయ్ సరసన మరోసారి నటిస్తే, కచ్ఛితంగా తనకి లిప్ లాక్ ఇస్తానని అంటుంది. దీంతో కోలీవుడ్ లో సమంత టాపిక్, హాట్ న్యూస్ గా మారింది. మొన్నటి వరకూ హీరో సూర్యని పొగడ్తలతో ముంచెత్తిన సమంత, ఇప్పుడు విజయ్ ని ఆకాశానికి ఎత్తేస్తుందని అంటున్నారు. మొత్తంగా సమంత నుండి లిప్ లాక్ ఆఫర్ ని అందుకున్న విజయ్, సిల్వర్ స్ర్కీన్ పై సమంతకి లిప్ లాక్ కోరికని తీరుస్తాడో? లేదో? చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: