సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ అనుష్క. ప్రస్తుతం అనుష్క క్రేజీ ప్రాజెక్ట్స్ తో తెగ బిజి షెడ్యూల్ ని గడుపుతుంది. ఇదిలా ఉంటే మరో వైపు నుండి కొంత మంది నిర్మాతలు తనని తెగ ఇబ్బందికి గురి చేస్తున్నారు. ముఖ్యంగా అనుష్క దీనికి సంబంధించిన విషయంలో తెగ బాధపడుతుందట. మేటర్ లోకి వెళితే, అనుష్క తెలుగులో కొత్తగా సినిమాలు అంగీకరించకపోవడం పలువురిలో అనుమానాలు రేకెత్తిస్తోంది. గత కొన్నాళ్లుగా ఈ చిన్నది 'బాహుబలి', 'రుద్రమదేవి' సినిమాలు చేస్తూ బిజీగా వుంది. ఒకరిద్దరు తమ సినిమాలలో అడిగినప్పటికీ ఆమె ఒప్పుకోవడం లేదట. ప్రస్తుతం చేస్తున్న రెండూ పూర్తయ్యాకనే కొత్త సినిమాలు చేస్తానని చెబుతూ వస్తోంది. అయితే, అదే సమయంలో తమిళంలో రజనీకాంత్, అజిత్ సినిమాలలో నటిస్తోంది. రజనీకాంత్ సరసన నటిస్తుండగా తనకి కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి కాని, వాటిని ఒప్పుకోవాలంటే కొంత స్టోరిని మార్చుకోవాలని, డైరెక్టర్స్ కి సలహాలు ఇస్తుంది. దీంతో తమిళ సినిమాలు కూడా చర్చల దశలో వున్నాయి. ఇదిలా ఉంటే, తెలుగులో కొత్త సంతకాలు పెట్టకపోవడానికి ప్రధాన కారణం, సీనియర్ హీరోల నుంచి అమ్మడికి ఆఫర్లు అంతగా రాకపోవడమే. యంగ్ హీరోలు ఆమెతో చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఎవరో ఒకరిద్దరు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి మాత్రమే ఆమెను సంప్రదిస్తున్నారు. అందుకే, తనకు అవకాశాలు వస్తున్న తమిళ రంగంపైనే దృష్టి పెడుతోందట. కాని తెలుగులో కొందరు నిర్మాతలు మాత్రం అనుష్క ని తెగ ఇబ్బంది పెడుతున్నారు. “పెద్ద హీరోలు మూవీలు లేవు కాబట్టి, భారీ రెమ్యునరేషన్ ఇస్తాము, యంగ్ హీరోలతో మూవీకి ఒప్పుకోవచ్చుకదా..” అంటూ టాక్స్ నడుపుతున్నారు. అంతే కాకుండా, తనకి వస్తున్న కొన్ని బడా ఆఫర్స్ ని సైతం కొందరు నిర్మాతలు ఏదోక విధంగా రాకుండా చేస్తున్నారనేది అనుష్క అనుమానం. మొత్తానికి అనుష్క నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ మేటర్ పక్కన పెడితే, తనకి ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఆఫర్స్ రావడం కష్టమే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: