అక్కినేని వంశం మూడో తరం నటుడు అక్కినేని అఖిల్ సిల్వర్ స్కీన్ ఎంట్రికి సంబంధించిన విషయాలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే అఖిల్ ఎంట్రి కోసం డైరెక్టర్ వినాయక్ అన్ని రకాలుగా సిద్ధం అవతున్నాడు. కథకి సంబంధించిన ఫైనల్ డిస్కషన్స్ త్వరలోనే పూర్తి కావొస్తున్నాయి. నాగార్జున సైతం వినాయక్ చెప్పిన స్టోరి లైన్ ని కొద్ది మార్పులతో ఓకె చేశాడు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు తెలియనున్నాయి. ఇదిలా ఉంటే అఖిల్ డెబ్యూ ఫిల్మ్ కి సంబంధించి విషయంలో మరో సరికొత్త న్యూస్ బయటకు వస్తుంది. ఈ మూవీలో హీరో నితిన్ కూడ అఖిల్ తో కనిపించనునన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన టాక్స్ టాలీవుడ్ లో క్లియర్ గా వినిపిస్తున్నాయి. ఎందుకంటే అఖిల్ సిల్వర్ స్ర్ర్కీన్ కి పరిచయం అవుతున్న మొదటి ఫిల్మ్ నిర్మాత సుధాకర్ రెడ్డి. ఈ నిర్మాత సుధాకర్ రెడ్డి బడా డిస్ట్రిబ్యూటర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో సుపరిచుడు. అలాగే నితిక్ కి ఫాధర్ కూడ సుధాకర్ రెడ్డినే. దీంతో సుధాకర్ రెడ్డి నిర్మాణ సారధ్యంలో వస్తున్న అఖిల్ డెబ్యూ ఫిల్మ్ లో, నితిన్ కూడ ఓ పాత్రలో కనిపంచబోతున్నాడు. వినాయక్ కూడ నితిన్ ని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాడు. వినాయక్ ఇప్పటికే దీనికి సంబంధించిన విషయాన్ని నాగార్జునకి తెలియజేయడం జరిగిందట. నాగార్జున కూడ నితిన్ తో మంచి పరిచయం ఉంది కాబట్టి, వినాయక్ ప్రపోజల్ కి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఓ స్టార్ హీరో తనయడు డెబ్యూ మూవీలో నితిన్ స్క్రీన్ స్పేస్ పంచుకోవడం అనేది, అందరికి ఒకింత ఆసక్తిగానే మారింది. వినాయక్ త్వరలోనే ఈ మూవీకి సంబంధికంచిన మరికొన్ని విషయాలను అఫిషియల్ అనౌన్స్ చేయనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: