మెగా స్టార్ గా చిరంజీవి, దర్శకరత్నగా దాసరి టాలీవుడ్ ను ఏలిన ఒకనాటి రోజులలో చిరంజీవి, దాసరిలు మంచి మిత్రులు. ఆ తరువాత రాజకీయాలలోకి వచ్చన తరువాత ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ సామాజిక వర్గంపై పట్టు సాధించడానికి ఒకరి పై ఒకరు పోటీపడి శత్రువులుగా మారిపోయారు.  దాసరి ఈ కోపాన్ని మెగా కుటుంబం పై అవకాశం చిక్కినప్పుడల్లా తన సెటైర్లతో వ్యక్త పరుస్తూనే ఉంటాడు. అటువంటి వీరిద్దరి మధ్య దూరం పెంచబోయే సంఘటన వచ్చేనెల జరగబోతోంది. దాసరి చాలా కాలం తరవాత దర్శకత్వం వహించిన ‘ఎర్రబస్సు’ నవంబర్ 14న విడుదల కాబోతోంది.  అయితే అదే తేదీని టార్గెట్ చేస్తూ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన 'పిల్లా నువ్వులేని జీవితం' విడుదల కావడం అనుకోకుండా జరుగుతోందా లేదంటే వ్యూహాత్మకంగా విడుదల చేస్తున్నారా అనే చర్చలు అప్పుడే ఫిలింనగర్ లో మొదలైపోయాయి. ఒకే రోజున విడుదల అవుతున్న ఈ రెండు సినిమాలలో ఏ ఒక్క సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా ఇప్పటికే పెరిగి పోయిన దాసరి, చిరంజీవుల మధ్య దూరాన్ని మరింత పెంచుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఈ వార్తలు ఇలా ఉండగా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రానికి బయ్యర్ల నుంచి వస్తున్న క్రేజ్ ను చూసి ట్రేడ్‌ వర్గాలు షాక్ అవుతున్నాయని టాక్. ఒక కొత్త హీరో సినిమాకు కృష్ణా జిల్లాలో కోటి రూపాయల ఆఫరింగ్ రావడం బట్టి మెగా హీరోల సినిమాలకు మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందొ అర్ధం అవుతుంది. చిన్న సినిమాలకు చిరునామాగా ఉండే దాసరి సినిమా మరొక కొత్త హీరో నటించిన చిన్న సినిమాతో పోటీ పడటం ఆశ్చర్యకరం..  

మరింత సమాచారం తెలుసుకోండి: