దీపావళికి విడుదలైన షారుఖ్ ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ మొదటి వారం పూర్తి కాకుండానే కేవలం 5 రోజులలో 230 కోట్లు వసూలు చేయడంతో మంచి జోష్ మీద ఉన్న షారుఖ్ ఈ సినిమా సక్సస్ ను ఎంజాయ్ చేస్తూ ముంబాయ్ లో ఈ సినిమా యూనిట్ సబ్యులకు ఇచ్చిన పార్టీలో ఈ సినిమా హీరోయిన్ దీపికను అందరూ చూస్తూ ఉండగా తన అదృష్ట దేవత అని చెపుతూ ఆమెకు బహిరంగంగా ముద్దులు పెట్టడం బాలీవుడ్ మీడియాకు హాట్ న్యూస్ అయింది.  ఈ ముద్దులు పెట్టుకోవడం చూసి ఆ పార్టీకి వచ్చిన వారు కూడా షాక్ అయ్యారు అంటే ఏ రేంజ్ లో ఈ ముద్దుల కార్యక్రమం జరిగిందో అర్ధం అవుతుంది. హిట్ల మీద హిట్స్ కొడుతూ బాలీవుడ్ అదృష్ట దేవతగా మారిన దీపిక పదుకొనే హవా అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  గత రెండు సంవత్సరాలలో అత్యధిక హిట్ చిత్రాల్లో నటించిన రికార్డు దీపికా పదుకొనే చిరునామాగా మారిపోయింది. అంతేకాదు ఇటీవల కాలంలో బాలీవుడ్ లో వంద కోట్ల క్లబ్ కలక్షన్స్ అందుకున్న అత్యధిక సినిమాల హీరోయిన్ గా దీపిక ఎవరూ చేరుకోలేని రికార్డులను క్రియేట్ చేసింది. కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా ‘యే జవానీ హై దీవానీ’, ‘చెన్నై ఎక్స్ ప్రెస్’, ‘రామ్ లీలా’ సినిమాలలో నటిగా కూడా తన సత్తాను చాటిన దీపక బాలీవుడ్ హీరోలకు 'లక్కీ మస్కట్' గా మారింది అంటూ బాలీవుడ్ మీడియా దీపికను ఆకాశానికి ఎత్తేస్తోంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: