ఈరోజు ఒక ప్రముఖ జాతీయ ఇంగ్లీష్ దినపత్రిక త్రివిక్రమ్ ప్రణితను తాను దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ సినిమాలో అందరి ముందు అవమాన పరిచాడు అనే ఆశక్తికర కథనాన్ని ప్రచురించింది. ఈ పత్రిక కథనం ప్రకారం అల్లుఅర్జున్ హీరోగా నటిస్తున్న త్రివిక్రమ్ సినిమాలో ప్రణిత కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొందని వార్తలు వ్రాస్తోంది. అయితే ఈ సినిమాలోని ఒక ప్రత్యేకమైన సన్నివేశంలో ఆమె కెమెరా ముందు ఎలా కనపడాలో స్పష్టంగా వివరించాడట త్రివిక్రమ్. అంతేకాదు ఆ సీన్ కు సంబంధించి ఎటువంటి డ్రెస్ తో రావాలో స్పష్టంగా వివరించాడట త్రివిక్రమ్. అయితే ఆ విషయాన్ని ప్రణిత సీరియస్ గా తీసుకోకుండా సెట్స్ మీదకు రెడీ అయ్యి వచ్చేసిందిట. దానితో త్రివిక్రమ్ కు విపరీతమైన కోపం వచ్చి యూనిట్ సభ్యులందరి ముందు ప్రణిత పై తన కోపాన్ని ప్రదర్శించాడని ఆ పత్రిక కథనం.ఈ సంఘటనకు షాక్ అయిన ప్రణిత ఆ సీన్ లో నటించకుండా ఆ షూటింగ్ స్పాట్ నుండి బయటకు వెళ్ళి పోవడంతో మరింత కోపగించిన త్రివిక్రమ్ ఆమె స్థానంలో నిత్యామీనన్ కు ఛాన్స్ ఇచ్చాడు అనే కథనాన్ని అ పత్రిక ప్రచురించింది. అయితే ‘అత్తారింటికి దారేది’ తో తన కెరియర్ కు టర్నింగ్ పాయింట్ ఇచ్చిన త్రివిక్రమ్ సలహాను పాటించకుండా ప్రణిత ఎందుకు ఇలా ప్రవర్తించింది అనే విషయం ప్రణితకే తెలియాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: