రేపు టాలీవుడ్ ప్రేక్షకులకు తన గ్లామర్ తో షాక్ ఇవ్వడానికి ‘కరెంటు తీగ’ గా రాబోతున్న సన్నీ లియోన్ కు బాలీవుడ్ లో ఆమె నటిస్తున్న ఒక సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. సన్నీ నటిస్తున్న బాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు ఆమె మెడ విపరీతంగా పట్టేయడంతో సన్నీ షూటింగ్ స్పాట్ లో ఉండలేక వెళ్ళి పోయిందట.  అంతేకాదు ఆ మెడ నొప్పి తీవ్రత ఎక్కువ అవడంతో తనకు విపరీతమైన బాధతో ఎన్ని టైగర్ బామ్ లు రాసుకున్నా నొప్పి తగ్గక చాల బాథ పడుతున్నాను అని అంటూ తన అభిమానులకు ట్విట్ చేసి తన బాధను కూడా పంచుకుంది. అయితే సన్నీకి షూటింగ్ స్పాట్ లో జరిగిన ఈ ప్రమాదపు వార్త పై మంచు కుటుంబం వీరాభిమానులు వేరే విధంగా స్పందిస్తూ సెటైర్లు వేస్తున్నారు.  బాలీవుడ్ సినిమాల ప్రమోషన్ కు ఎంతగానో సహకరించే బాలీవుడ్ బ్యూటీలు తెలుగు సినిమాల విషయంలో కోట్లాది రూపాయలను పారితోషికంగా తీసుకుంటూ వారు నటించిన సినిమాల ప్రమోషన్ కు కూడా రారు అన్న విమర్శలను నిజం చేస్తూ,అందరు ఎంతో ఆశగా ‘కరెంటు తీగ’ ఆడియో వేడ కకు సన్నీ వస్తుందని ఆశ పడ్డా అందర్నీ నిరాశ పరుస్తూ ‘కరెంటు తీగ’ ఆడియో వేడుకకు డుమ్మా కొట్టి అనేక మందిని నిరాశ పెట్టినందుకు సన్నీకి ‘కరెంటు తీగ’ శాపం పెట్టి సన్నీని ఇలా బాధ పెడుతోంది అంటూ మంచు హీరోల అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: