పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి రేణుదేశాయ్ ఝలక్ ఇచ్చినట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపినిస్తున్నాయి. సొసైటిలోని ఫేం ఉన్న వ్యక్తుల వ్యక్తిగత జీవితాలలోకి తొంగి చూస్తే అంత అర్ధవంతంగా కనిపించవు. అయితే వారు సొసైటీకి మాత్రం ఎంతో కొంత మంచి చేసినవారుగా ఉంటారు. అందుకే సెలబ్రిటీల ఆదర్శలాను మనం తీసుకోవాలి కాని, వారి వ్యక్తిగత జీవితాల విషయాలలోకి తొంగిచూడటం కరెక్ట్ కాదు. ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ కి రేణుదేశాయ్ ఝలక్ అంటే ఇదేదో వ్యక్తిగత జీవితం గురించి చర్చించిన మేటర్ కాదు. ఇప్పుడు మేటర్ లోకి వెళితే, ఈ మధ్య కాలంలో రేణుదేశాయ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో ఎక్కువుగా టచ్ లో ఉంటుంది. ముఖ్యంగా తను నిర్మాతగా మారినప్పటి నుండి రేణుదేశాయ్ సినిమా పరంగా బిజిగా ఉంటున్నారు. తను నిర్మించిన చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు ఓ నిర్మాతగా తన వంతు ప్రమోషనల్ బాధ్యతలను తీసుకున్నారు. దాంతో రేణుదేశాయ్ ఎప్పుడూ సోషియల్ నెట్ వర్కిగ్ సైట్స్ లో ఏదోక కామెంట్ ని పోస్ట్ చేస్తూ, టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. తాజాగా ను తను టాలీవుడ్ లోనూ ఓ మూవీకి నిర్మాతగా మారటానికి సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా తను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీకి నిర్మాతగా ఉండేందుకు ఇష్టపడుతున్నారట. వీరిద్దరూ గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నారని ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. కాని రేణుదేశాయ్ మాత్రం పవన్ కళ్యాణ్ తో మూవీని నిర్మించేందుకు తెగ ఆసక్తి చూపుతుంది. అందుకే ఓ నిర్మాతలో పవన్ కళ్యాణ్ మూవీలో భాగస్వామ్య నిర్మాతగా ఉంటానంటూ చర్చలు జరిపిందట. ఇప్పడు ఆ టాక్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికి తెలిసింది. అలాగే ఈ న్యూస్ పవన్ కళ్యాణ్ కి తెలిసి, ఆశ్ఛర్యపోయాడంట. దాంతో రేణుదేశాయ్, పవన్ కళ్యాణ్ ని ఆశ్ఛర్య పరిచి, భలే ఝలక్ ఇచ్చిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: