గత కొంత కాలంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలలో బూతు పదజాలం ఎక్కువుగా వినిపిస్తుంది. ఇప్పుడు కమర్షియల్ డైరెక్టర్ గా మారిన మారుతి, ఈ తరహా చిత్రాలకు మరింత ఎంకరేజర్ గా మారాడు. తను తీసిన బస్టాప్ మూవీ బూతుల స్టాప్ మారటం, అలాగే కొన్ని లోబడ్జట్ డబుల్ మీనింగ్ డైలాగ్ మూవీలు బాక్సాపీస్ షేక్ చేయడంతో, ఈ తరహా చిత్రాలకు మళ్లీ ఊపిరి వచ్చినట్టయింది. దీంతో అప్ కమింగ్ డైరెక్టర్స్ లోని ఓ వర్గం, అలాగే కథతో సంబంధం లేకుండా, కేవలం బిజినెస్ కోసమే చూసే మరో నిర్మాతల వర్గం కాంబినేషన్స్ అనేత బూతు మూవీలు తెరకెక్కుతున్నాయి. దీంతో యూత్, ఈ తరహా డి గ్రేడ్ మూవీలకి అడిక్ట్ అవుతుంది. తాజాగా "టెన్త్ లో లక్..ఇంటర్‌లో కిక్..బిటెక్‌లో ..?" అంటూ ఓ మూవీకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టర్లులో మాత్రం బూతు బాగా దర్శనమిస్తోంది. చిత్ర యూనిట్ యూత్ ఫుల్ సినిమా అంటుంది కాని, పోస్టర్స్ మాత్రం మాత్రం బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని తలదన్నేలా పోస్టర్ డిజైనింగ్ ఉంది. ఇంత అడల్డ్ కంటెంట్ తో కనిపిస్తున్న పోస్టర్స్ ని చూస్తే మూవీలో కచ్ఛితంగా ఎటువంటి మెసేజ్ లేదనే తెలుస్తుంది. ఇకనైన లాభాల బాటలు పక్కన పెట్టి, కనీసం చిన్న మూవీలు అయినా ఎటువంటి మెసేజ్ ఇవ్వలేకపోయినా, కనీస విలువలతో మూవీలను తెరకెక్కిస్తే బాగుంటుంది సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ తరహా మూవీలని ఎంకరేజ్ చేస్తే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ విలువలు పతనం కావడం ఖాయం అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: