వెంకటేష్ సీనియర్ హీరోగా మారిన తరువాత యంగ్ హీరోల నుంచి వస్తున్న పోటీని తట్టుకుని నిలబడటానికి వెరైటీ స్క్రిప్ట్ లను సినిమాలుగా తీస్తూ తన హవా కొనసాగిస్తున్నాడు, క్రియేటివ్ దర్శకుడిగా పేరుగాంచిన చంద్రశేఖర్ ఏలేటి ఒక విభిన్నమైన కథను తయారుచేసి ఆ కథకు సరిగ్గా సరిపోయే హీరో గురించి వెతుకుతూ విభిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ సంవత్సరం హ్యాట్రిక్ ప్రొడ్యూసర్ గా పేరుగాంచిన సాయి కోర్రపాటిని కలిసి తన కథను వినిపించాడట చంద్రశేఖర్ ఏలేటి.  ఈ స్క్రిప్ట్ లో హీరోకు 50 సంవత్సరాలు ఉంటే హీరోయిన్ కు సుమారు 17 ఏళ్ల వయస్సులో ఉంటుందట. విభిన్నమైన ఈ కథను విన్న సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు రావడమే కాకుండా ఈ సినిమాకు హీరోగా వెంకటేష్ ను ఒప్పించే బాధ్యతను కొర్రపాటి సాయి తీసుకున్నాడని టాక్. ఈ మధ్యనే ఈ విభిన్నమైన కథను కొర్రపాటి సాయి దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తో కలిసి వెంకీకి కథను వినిపించినప్పుడు ముందు షాక్ అయిన వెంకటేష్ నవ్వుతూ హీరోయిన్ ఎక్కడ దొరుకుతుంది అని ప్రశ్నించాడని తెలుస్తోంది. ఈ ప్రశ్నతో ఈకథ వెంకటేష్ కు నచ్చింది అని భావించిన వీరిద్దరూ ప్రస్తుతం ఈ కథకోసం హీరోయిన్ వేటలో పడ్డారని టాక్. మరి కొందరైతే ఈ కథకు అవికా గోర్ సరిపోతుంది అనే సూచనలు కూడా చేస్తున్నారట. ఈ వార్తలే నిజం అయితే వచ్చే సంవత్సరం వెంకటేష్ నుండి మరో వెరైటీ సినిమా రాబోతోంది అని అనుకోవాలి..   

మరింత సమాచారం తెలుసుకోండి: