ఒకప్పుడు టాలీవుడ్ సినిమా రంగానికి ఫ్యామిలీ హీరోగా ఒక వెలుగు వెలిగి దాదాపు100కు పైగా సినిమాలలో నటించి ‘లెజెండ్’ సినిమాతో విలన్ గా మారిన జగతిబాబు విలన్ పాత్రల పై హాట్ కామెంట్స్ విసిరాడు. ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతిబాబు అనేక జీవిత సత్యాలను బయట పెట్టాడు. తన విలన్ పాత్రల ఎంట్రీ గురించి మాట్లాడుతూ టాలీవుడ్ లో విలన్ పాత్రలు చేసి హీరోలుగా మారిన నటులు ఉన్నారు కాని హీరో పాత్రలు చేసి విలన్ గా మెప్పించిన రికార్డు తనకు మాత్రమే దక్కింది అని అంటూ హీరోగా అనేక పాత్రలు కొన్ని సంవత్సరాలు చేసిన తరువాత విలన్ గా ప్రవేసించి మెప్పించడం అంత సులువు కాదు అని అంటూ కొన్ని సదర్భాలలో హీరో పాత్ర పోషించడం కన్నా విలన్ పాత్ర పోషించడం పెద్ద సవాల్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు జగపతిబాబు. తాను ఫెయిల్యూర్ నటుడిని కాకపోయినా ఇక తాను హీరోగా ఆడియెన్స్‌ని మెప్పించలేనని తెలుసుకుని విలన్ గా మారానని అంటూ తాను నటించన 'లెజెండ్' సూపర్ హిట్ కావడం తన అదృష్టం అని అన్నాడు జగపతి.  జగపతి ప్రొడక్షన్స్ పేరిట పెద్ద పెద్ద హీరోలతో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసిన తన తండ్రి నిర్మాత రాజేంద్రప్రసాద్ ఆర్థికంగా ఏమి మిగుల్చు కోలేకుండా ఉండిపోయారో, అదేవిధంగా ఇన్ని సినిమాలు చేసిన తాను కూడా ఏమి సంపాధించు కోలేకపోయానని అంటూ తానెప్పుడూ స్నేహానికే మొదటి ప్రాధాన్యతని ఇచ్చాను కానీ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేక పోవడంతో చాల పెద్ద మొత్తాలలో డబ్బును పోగొట్టుకున్నాను అనే సంచలన నిజాన్ని బయట పెట్టాడు జగపతిబాబు. తన తండ్రిలాగే తనకుకూడా ఔదార్యం ఎక్కువ అవ్వడంతో తాను సంపాదించింది అంతా పోగొట్టుకున్నానని, అయినా తనకు భాదలేదు అంటూ తనను అర్ధం చేసుకున్న భార్యా, పిల్లలు తనకు ఉండటం తన అదృష్టం అని అంటూ తన వ్యక్తిగత జీవితంలోని ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు జగపతిబాబు..

మరింత సమాచారం తెలుసుకోండి: