ఎటువంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా విడుదలైన ‘కార్తికేయ’ హిట్ టాక్ ను తెచ్చుకోవడమే కాకుండా మొదటి వారం పూర్తి చేసుకునే సరికి 10 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది అనే వార్త ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమలో సంచలనంగా మారింది. విశ్లేషకుల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘కార్తికేయ’ శాటిలైట్ రైట్స్‌తో కలిపి దాదాపు 10 కోట్లు రాబట్టినట్టు టాక్.  తెలుగు రాష్ర్టాల్లోనేకాదు చివరకు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం వసూళ్లు బాగానే రాబట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాను కొనుక్కున్న డిస్ర్టిబ్యూటర్లు లాభాల్లోకి వచ్చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకు టాలీవుడ్‌లో లాభాలు భారీగా రావడంతో ప్రొడ్యూసర్లు అంతా భారీ సినిమాలకు బదులు మంచి క్వాలిటీతో చిన్న సినిమాలు తీస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనలకు ‘కార్తికేయ’ విజయం ప్రాతిపదికగా మారింది అని అంటున్నారు.  ఈ సంవత్సరం థ్రిల్లర్ సినిమాలుగా విడుదల అయిన ‘దృశ్యం’, ‘గీతాంజలి’, ‘కార్తికేయ’ సినిమాలు సూపర్ హిట్ కావడంతో ప్రస్తుత తరం యంగ్ హీరోలు అంతా థ్రిల్లర్ సినిమాల వైపు ఆలోచించేలా ‘కార్తికేయ’ ప్రభావితం చేసింది అని అంటున్నారు.  ఈ వార్తలు ఇలా ఉండగా ‘కార్తికేయ’ ఇచ్చిన సక్సస్ తో నిఖిల్ తన పారితోషిక విషయంలో కోటి రూపాయల స్థాయికి ఎదిగి పోయాడు అనే వార్తలు ఫిలింనగర్ విపిస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: