“గౌరవం” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కలిసి రాకపోవడంతో ఆ తరువాత ‘కొత్త జంట’ గా వచ్చాడు అల్లు శిరీష్ ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయినా నటుడిగా అల్లు శిరీష్ కు ప్రేక్షకులు పాస్ మార్కులు వేసారు. ఆ తరువాత ఇంకా మంచి సినిమాలో నటించి తన సత్తా చాటుదామని వరస పెట్టి సినిమా కథలు వింటున్న అల్లు శిరీష్ స్పీడ్ కు అల్లు అరవింద్ బ్రేక్ వేసాడు అనే వార్తలు కూడా ఉన్నాయి.  అయినా టాలీవుడ్ లో తన రేంజ్ చూపెట్టడానికి అల్లు శిరీష్ పట్టువదలని విక్రమార్కుడులా ప్రయత్నిస్తున్నాడు అని చాలామంది అంటారు. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ అల్లు శిరీష్ మనసు ఇప్పుడు 1990 లో వచ్చిన ఒక హాలీవుడ్ సినిమా పై మనసు మళ్ళింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఒక ప్రముఖ దర్శకుడి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి అల్లు శిరీష్ కు ఈ మధ్య చెప్పిన ఒక లైన్ నచ్చడంతో హాలీవుడ్ సినిమా కథను పోలి ఉన్న ఆ కథను స్క్రిప్ట్ గా మార్చమని శ్రీధర్ శ్రీపానకు చెప్పడమే కాకుండా ఈ సినిమా కథ విషయమై మారుతితో వరస పెట్టి చర్చలు జరుపుతున్నాడట అల్లు శిరీష్.  వినిపిస్తున్న వార్తలే నిజం అయితే అల్లు శిరీష్ త్వరలోనే మరో హాలీవుడ్ సినిమా ప్రయోగం మన టాలీవుడ్ లో చేయబోతున్నాడు అనుకోవాలి...  

మరింత సమాచారం తెలుసుకోండి: