ఈమధ్య కాలంలో యంగ్ హీరోలు నటిస్తున్న సినిమాలలో పాత సినిమాల పాటల రీమిక్సింగ్ ట్రెండ్ బాగా కొనసాగుతోంది. ఇక పోతే అక్కినేని, నందమూరి, చిరంజీవి నటవారసులుగా టాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఆ కుటుంబ హీరోలు తమ తాతలకు, తండ్రులకు సంబంధించిన ఒకనాటి సూపర్ హిట్ సాంగ్స్ ను రీమిక్స్ చేసి సూపర్ హిట్లను కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు.  ఇటువంటి ప్రయత్నాలలో అక్కినేని మనవళ్ళు తమ తాతను ఫాలో అవుతూ అక్కినేని దూరం అయిపోయినా ఆయన జ్ఞాపకాలు చెరిగి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘మనం’లో అక్కినేని నేను పుట్టాను పాట వినిపిస్తే, ఒక లైలా కోసంలో మరోసారి అక్కినేని పాట రీమిక్స్ అయ్యింది. ఇప్పుడు అఖిల్ కూడా తన మొదటి సినిమా విషయంలో ఎవరూ ఊహించని ఒక సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.  తన అన్న నాగచైతన్య తమ తాత అక్కినేని సూపర్ హిట్ పాటలను రీమిక్స్ చేస్తే అఖిల్ తన రూట్ మార్చి తన తండ్రి నటించిన ‘హలో బ్రదర్’ సినిమాలోని 'కన్నెపిట్టరో' పాట పై కన్నేశాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. తన తండ్రి నాగార్జున లాగే ఈ పాటలో ముగ్గురు భామలతో చిందేస్తాడట అఖిల్. అఖిల్ నటించబోయే మొదటి సినిమా ఇమేజ్ పెంచడానికి ఈ ఐటమ్ సాంగ్ లో ముగ్గురు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీలు ఉంటారని టాక్.  తన తండ్రి నాగార్జున నటించిన ‘హలో బ్రదర్’ సినిమాను తామే సొంతంగా రీమేక్ చేసి ఆ సినిమాలో నటించాలని మనసు పడ్డాడు నాగచైతన్య. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కోరిక నెరవేరలేదు. చైతు మనసు పడ్డ హలో బ్రదర్ సినిమాలోని ‘కన్నెపిట్టరో’ పాటను ఇప్పుడు అఖిల్ తన్నుకు పోవడం చైతన్యకు షాక్ అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: