సల్మాన్ ఖాన్ తన ముద్దుల చెల్లి అర్పిత పెళ్ళి కోసం ముంబాయి నుండి హైదరాబాద్ కు వస్తున్న నేపధ్యంలో మధ్యలో తగిలిన కాజల్ టార్చర్ కు విసికి పోయిన సల్మాన్ ఖాన్ విషయం ఒకటి మీడియాలో హడావిడి చేస్తోంది. ఇక వివారలలోకి వెళితే నాలుగు రోజుల క్రితం కాజల్ ముంబాయి నుండి హైదరాబాద్ రావడానికి ఎయిర్ పోర్టుకు వెళ్ళాక అక్కడ తాను ఎక్కవలసిన విమానం అరగంట ఆలస్యం అని తెలియడంతో ఏమి చేయాలో తెలియక కూర్చోవడానికి సెలెబ్రెటీ టెర్మినల్ లోకి వెళ్లిందట కాజల్.  అయితే అక్కడ ఆమెకు షాక్ ఇస్తూ ఒంటరిగా కూర్చున్న సల్మాన్ కనిపించడంతో ఆనందం పట్టలేక కాజల్ అతడి వద్దకు వెళ్ళి తాను సల్మాన్ వీరాభిమానిని అంటూ ఈ కండల వీరుడును మాటలలోకి దించిందట కాజల్.  అంతేకాదు సల్మాన్ కూడా వెళుతున్నది హైదరాబాద్ అని తెలుసుకుని మరింత ఆనంద పడిపోయి ఆ ఫ్లైట్ లోని సల్మాన్ పక్క సీట్ లో కూర్చున్న వ్యక్తిని రిక్వెస్ట్ చేసి తన సీట్ లో కూర్చో పెట్టి కాజల్ ఆ ఫ్లైట్ లో సల్మాన్ పక్కన కూర్చుని ఎన్నో విషయాలు ఆయనను అడిగి తెలుసుకున్నాను అని అంటూ సల్మాన్ కూడా చాల ఓపిగ్గా తన మాటలకు బదులు ఇచ్చాడు అంటూ పొంగి పోతూ ఆ సంఘటనను తన ట్విటర్ లో షేర్ చేసుకుంది కాజల్.  ప్రస్తుతం సల్మాన్ దగ్గర ప్రేయసి స్థానం ఖాళీగా ఉంది కాబట్టి ఆ చాన్స్ ఏమైనా కాజల్ కొట్టేస్తుందేమో చూడాలి. అయితే ఆ ఫ్లైట్ లో వీరిద్దరి సంభాషణలు దూరం నుంచి చూసిన ప్రయాణికులు మాత్రం కాజల్ అత్యుత్సాహనికి సల్మాన్ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు అని టాక్..   

మరింత సమాచారం తెలుసుకోండి: