మాటల మాంత్రికుడిగా ఈ రోజు టాలీవుడ్ సినిమా రంగాన్ని తన క్రియేటివిటి తో శాసిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కు దర్శకుడు హరీష్ శంకర్ సలహాలు ఇస్తున్నాడు అంటే ఎవ్వరూ నమ్మరు. అయితే ఈ ఫోటోను బట్టి హరీష్ శంకర్ ఎదో ఒక విషయం పై ఒక సీరియస్ సలహాను త్రివిక్రమ్ కు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.  ప్రస్తుతం అల్లుఅర్జున్ తో ఒక భారీ సినిమాను తీస్తూ బిజీగా ఉన్న త్రివిక్రమ్ ను హరీష్ శంకర్ ఆ సినిమా షూటింగ్ స్పాట్ లో కలిసాడట. అంతేకాదు వారిద్దరూ కలిసిన సందర్బానికి సంబంధించిన ఫోటోను తన ట్విటర్ లో పెడుతూ ‘లెజెండ్ ను కలిసాను గ్రేట్ టైమ్’ అంటూ ట్విట్ చేసి తన ఆనందంతో కూడుకున్న భక్తిని వ్యక్త పరిచాడు హరీష్ శంకర్.  ‘అత్తారింటికి దారేది’ తరువాత త్రివిక్రమ్ అల్లుఅర్జున్ కెరియర్ లోనే అత్యంత భారీ చిత్రంగా తీస్తున్న సినిమా షూటింగ్ లో త్రివిక్రమ్ ఎంతో నిదానంగా హరీష్ శంకర్ చెపుతున్న మాటలు వింటూ ఉండటం ఈ ఫోటోలో కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అంత నిదానం ఉంది కాబట్టే త్రివిక్రమ్ ఈరోజు టాప్ డైరెక్టర్ల స్థాయిలో ఉన్నాడు. ‘సుబ్రహ్మణ్యం ఫర్ షేల్’ అన్న వెరైటీ టైటిల్ తో సినిమా తీస్తున్న హరీష్ శంకర్ త్రివిక్రమ్ కు ఏమి సలహాలు ఇచ్చాడో వారిద్దరికే తెలియాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: