సూపర్ స్టార్ రజినీకాంత్ తన నటనలోనే కాదు తన ప్రవర్తనలో కూడా రియల్ సూపర్ స్టార్ అని అనిపించుకునే ఒక అరుదైన సంఘటన మొన్న గోవాలో జరిగింది. భారతదేశం నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సినిమా రంగ ప్రముఖులు పాల్గొంటున్న అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో రజిన అమితాబ్ పట్ల ప్రవర్తించిన తీరు అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా ఆయన ఖ్యాతిని మరింత పెంచింది.  ఈ ఫిలిం ఫెస్టివల్ లో ఈ శతాబ్దపు ఫిలిం పర్సనాలిటి అవార్డును రజినీకాంత్ కు అమితాబ్ వేలాది మంది ప్రముఖుల సమక్షంలో అందచేసిన తరువాత దక్షిణాది సినిమా రంగాన్ని శాసిస్తున్న రజినీ అతి వినమ్రంగా వొంగి అమితాబ్ పాదాలకు నమస్కరించడం ఈ ఫిలిం ఫెస్టివల్ కు హైలెట్ గా మారింది. ఈ అవార్డు అందుకున్న తరువాత రజినీ ఉద్వేగభరితంగా మారిపోయి అమితాబ్ ను తన పెద్ద అన్నయ్య అని సంబోదిస్తూ అమితాబ్ లాంటి గొప్ప వ్యక్తి మాట్లాడిన తరువాత తన దగ్గర మాట్లాడటానికి ఏ విషయాలు లేవు అని చెపుతూ తనకు నటన నేర్పిన ఎందరో దర్శకులకు ఈ శతాబ్దపు పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను అన్న అమితాబ్ మాటలు విన్న అనేకమంది ఫారిన్ డేలిగేడ్స్ రజినీ లాంటి వినమ్రతతో కూడిన నటుడు ప్రపంచంలో మరెవ్వరూ లేరు అన్న మాటలు రజినీ కాంత్ కీర్తిని మరో ఉన్నత శిఖరం పైన కూర్చోపెట్టాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: