టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ రేసులో ప్రస్తుతం రెజీనా, రకుల్ ప్రీత్ ల మధ్య పోటీ విపరీతంగా నడుస్తోంది. వీరిద్దరిలో ఎవరు టాప్ యంగ్ హీరోయిన్ గా ఎదుగుతారు అన్న ఆ శక్తి అందరిలోనూ ఉంది. గత వారం విడుదలైన ‘పిల్లా నువ్వులేని జీవితం’ హిట్ కావడంతో రెజీనా మెగా హీరోయిన్ గా మారిపోయి త్వరలోనే బన్నీ చరణ్ లతో కూడా రొమాన్స్ చేయబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే లిప్ లాక్ ల దగ్గర నుంచి ఎక్స్ పోజింగ్ వరకు దేనికైనా రెడీ అంటోంది రెజీనా.  ఇలాంటి పరిస్థుతులలో తెలుగులో డబ్ చేయబడి విడుదల కాబోతున్న రెజీనా నటించిన ఒక తమిళ సినిమా ఆమె టాలీవుడ్ కేరియర్ కు అడ్డుగా మారబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. వినపడుతున్న వార్తల ప్రకారం రెజినా ఒక చిన్న పిల్లకు తల్లిగా నటించిన తమిళ సినిమా త్వరలో తెలుగు లో ‘నిర్ణయం’ పేరుతో విడుదల కాబోతోంది. ప్రముఖ తమిళ దర్శకుడు శరవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించిన రానావిక్రమ్, రెజినాలు తమ పెళ్ళికి తమ తల్లితండ్రులు అంగీకరించక పోవడంతో ఇంటినుండి బయటకు వెళ్ళి పెళ్ళి చేసు కుంటారు. ఆ తరువాత వారి జీవితాలు అనుకోని మలుపు తిరిగి ఒక క్రైమ్ లో చిక్కుకుంటారు. ఈ సినిమాలో రెజీనా కూతురిగా ఐదు ఏళ్ళబేబీ వేదిక ఒక కీలక పాత్ర పోషిస్తోంది. తన భర్త తనకు దూరం కావడంతో తన 5ఏళ్ళ కూతురుని పెట్టుకుని ఈ వ్యతిరేక పరిస్థితులను ఎలా ఎదురీది పోరాడి విజయం సాధించింది అన్నది కధాంశం . గ్లామర్ అన్నది లేకుండా అత్యంత సహజంగా ఒక బిడ్డ కోసం ఆరాట పడే పాత్రలో రెజీనా నటించింది. అయితే ఇటువంటి తల్లి పాత్రలో రెజీనా కనపడితే రెజీనా గ్లామర్ బ్యూటీ గా కనిపించబోయే భవిష్యత్ సినిమాల అవకాశాలకు ఈ నిర్ణయం శాపంగా మారుతుందా అనే మాటలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: