తాము తీస్తున్న సినిమాకు ఏ పేరు పెట్టాలో తెలియని అయోమయంలో ఉంటూ అదే సినిమాకు పేరు పెట్ట కుండానే టీజర్ రిలీజ్ చేసిన ఘనత నాగచైతన్య తన పుట్టినరోజునాడు అందుకున్నాడు. ఈరోజు జరుగుతున్న చైతు పుట్టినరోజు సందర్భంగా ‘స్వామిరారా’ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ మూవి టీజర్ నిన్న సాయంత్రం విడుదలైంది. నాగ చైతన్య వాయిస్ ఓవర్‌తో ‘ప్రతి మోసం వెనుక ఇద్దరుంటారు ఒకరు మోసం చేసేవారు, మరొకరు మోసపోయేవాడు ఆ రెండవది కాకుండా ఉండాలంటే మొదటి వాడుగా ఉండాలి’ అంటూ చైతన్య గొంతుతో డిఫరెంట్ గా చెప్పిన ఈ డైలాగ్ ను బట్టి నాగచైతన్యను మరో యాంగిల్ లో చూపెట్టే క్రీమ్ థ్రిల్లర్ అవుతుందని అనుకోవచ్చు. ఈ టీజర్ లో నాగచైతన్య చాల స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటే మహేష్ హీరోయిన్ కృతి సనన్ హాట్ గా కనిపించింది. ఇంతకీ సినిమా పేరేమిటో తెలియని అక్కినేని అభిమానుల సందేహాలు తీరుస్తూ ‘ఇంక మాకే దొరకలేదు’ అనే డైలాగ్ బ్రహ్మానందoచేత చెప్పించి ఈ టీజర్ కు మరో ట్విస్ట్ ఇచ్చాడు సుధీర్ వర్మ. ఫిలింనగర్ లో వినిపిస్తున్న మాటల ప్రకారం ఈ సినిమాకు ‘దొరకడు’, మోసగాడు, ‘మాయగాడు’ ఈ మూడు టైటిల్స్ లో ఏదోఒకటి నిర్ణయింప బడుతుందని టాక్.   

మరింత సమాచారం తెలుసుకోండి: