ప్రభాస్ నటిస్తున్న ‘బాహుబలి’ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం చివరకు పూర్తి కాబోతూ ఉండటంతో వచ్చే సంవత్సరంలో తాను వెంటనే నటించ బోయే సినిమా పై దృష్టి పెట్టాడు అనే వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్ పై ప్రభాస్ దృష్టి పడింది అని టాక్.  దాదాపు 50 షార్ట్ ఫిలిమ్స్ తీసిన సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉండబోతుంది అని అంటున్నారు. ఈ సంవత్సరం విడుదల అయిన ‘రన్ రాజా రన్’ సినిమాకు దర్శకత్వం వహించిన సుజిత్ డైరక్షన్ టేకింగ్ స్టైల్ ప్రభాస్ కు బాగా నచ్చడంతో ప్రభాస్ ఈ బంపర్ ఆఫర్ సుజిత్ కు ఇచ్చాడు అనే వార్తలు విని పిస్తున్నాయి.  ప్రభాస్ కజిన్ ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతగా వ్యవహరించబోయే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్స్తున్న సుజిత్ కుడా ప్రభాస్ కు దూరపుచుట్టం అనే మాటలు ఉన్నాయి. ఈ మధ్యనే ప్రభాస్ తన వద్దకు సుజిత్ ను పిలిపించుకుని ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘వర్షం’ లాంటి సాఫ్ట్ కధతో కూడిన స్క్రిప్ట్ తయారు చేయమన్నాడని టాక్ . కత్తి యుద్దాలు, గుర్రపు సవారీలు చేసిన ప్రభాస్ కు విసుగేత్తి సాఫ్ట్ కథల పై మనసు మళ్ళింది అని అనుకోవాలి..   

మరింత సమాచారం తెలుసుకోండి: