టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డం కోసం చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే ఇది ఎక్కువుగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోలు ఎంత మంది పరిచయం అవుతుంటారో, అంతకంటే ఎక్కువు రెట్లు హీరోయిన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతారు. దీంతో హీరోయిన్స్ మధ్య ఎక్కువ పోటీతత్వం ఉంటుంది. అయితే చాలా కొద్ది మంది మాత్రమే ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి చేరుకుంటారు. ఆ విధంగా వచ్చిన వారిలో సమంత ఒకరు. ఇప్పుడు సమంతతో పోటి పడే హీరోయిన్స్ కొద్ది మందే ఉన్నప్పటికీ, వారికి మంచి టాలెంట్ ని చూపించేందుకు సమంత ఎప్పుడూ తహ తహలాడుతూనే ఉంటుంది. తాజాగా వైజాగ్ మరియు అక్కడి పరిసర ప్రాంతాల్లో హుడ్ హుడ్ సృష్టించిన నష్టం మన అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్. టి. ఆర్, అల్లు అర్జున్ తమ వంతు సాయం చేసారు. ఆ లిస్టు లో తాజా గా సమంత చేరింది. అంతే కాకుండా సమంత తన తోటి హీరోయిన్స్ కి సైతం సవాల్ విసిరింది. "టాలీవుడ్ లో కేవలం స్టార్ డం ని సంపాదించుకోవడం కాదు, అక్కడ ఆపదలు వస్తే మన వంతుగా సహాయం చేయాలి. నాలాగే మరి కొంత మంది హీరోయిన్స్ బాధితులకి సహాయం అందిస్తే చాలా మంచిదంటూ" స్టేట్ మెంట్ ఇచ్చింది. దీంతో సమంత అన్న మాటలు, కేవలం తన తోటి హీరోయిన్స్ ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సమంత నారా చంద్రబాబు నాయుడు ని కలిసిన సమంత పది లక్షల చెక్కుని ఆయనకి అందచేసింది. ఒక్క పెద్ద నటి ఇటివంటి మంచి పని కి సహాయం చేయడంపై ఫిల్మ్ ఇండస్ట్రీలోని పలువురు సంతోషాన్ని వ్యక్త చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: